Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
పెదాల మీద బ్లాక్ స్పాట్స్ తొలగించే 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్...
ముఖంలో మరో ముఖ్యమైన భాగం పెదాలు. మేకప్, మరియు కాస్మోటిక్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది పెదాలకు మాత్రమే..ప్రతి అమ్మాయి సాప్ట్ గా, బ్యూటిఫుల్ గా మరియు పింక్ లిప్స్ కలిగి ఉండాలని కోరుకుంటారు . పెదాలకు వేసే రంగు ముఖంలో మరింత అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ కొన్ని సందర్బాల్లో ఈ కలను నిరాశపరుస్తుంది. అందమైన పెదాల మీద బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతాయి. ఇలా అందమైన పెదాల మీద బ్లాక్ స్పాట్స్ ఏర్పడటం ఏఒక్క అమ్మాయి కోరుకోదు. కాబట్టి, పెదాల మీద బ్లాక్ స్పాట్స్ తొలగించడం ఎలా? ఇటువంటి బ్లాక్ స్పాట్స్ నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి .
అయితే, పెదాల మీద బ్లాక్ స్పాట్ నివారించుకోవడానికి ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు, పెదాల మీద ఇటువంటి బ్లాక్ స్పాట్స్ ఎందుకొస్తాయని తెలుసుకోవాలి. అప్పుడే నివారించుకోవడం సులభమవుతుంది.
పెదాల మీద బ్లాక్ స్పాట్స్ ఏర్పడటానికి కొన్ని కారణాలు :
విటమిన్ బి లోపం , పాతబడిన లిప్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం, మద్యం, స్మోకింగ్ హ్యాబిట్స్ , శరీరంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం , పెదాలలో డ్రైనెస్ అధికమవ్వడం, హార్మోనులు అసమతుల్యతలు.
పెదాల మీద బ్లాక్ స్పాట్స్ తొలగించడానికి 9 నేచురల్ హోం రెమెడీస్ :

నిమ్మరసం :
పెదాల మీద బ్లాక్ స్పాట్స్ ను తొలగించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరంసను ఫింగర్ టిప్స్ తో పెదాల మీద అప్లై చేసి మర్దన చేయాలి. లేదా లెమన్ తో తయారుచేసిన లిప్ బామ్ అప్లై చేయడం వల్ల అందులో ఉండే సిట్రస్ ప్రభావం వల్ల పెదాల మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్ ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి .

హడ్రేషన్ :
ప్రతి రోజూ కనీసం 8 లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. అదే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండే వ్యక్తులైతే మరింత ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. శరీరం తగినంత తేమ కలిగి ుండటం వల్ల , పెదాలలో కూడా బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ ను పెదాల మీద అప్లై చేసి మర్ధన చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి . కాటన్ బాల్ ను వెనిగర్ లో డిప్ చేసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

విటమిన్ సి:
నిమ్మరసంను ఇతర సిట్రస్ ఫ్రూట్స్ జ్యూస్ లతో కలిపి పెదాలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలిత ఉంటుంది. పెదాల మీద ఉండే బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి

గ్లిజరిన్ :
పెదాలకు గ్లిజర్ ను తరచూ అప్లై చేస్తుంటే బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి . గ్లిజరిన్ లో కొన్ని రోజాపువ్వు ఆకులు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

స్ట్రాబెర్రీస్ :
స్ట్రాబెర్రీస్ ను మెత్తగా చేసి , పెదాలకు అప్లై చేయడం వల్ల పెదాల మీద ఉండే నలుపు తగ్గిపోతుంది.

షుగర్ స్ర్కబ్:
పెదాల మీద షుగర్ స్ర్కబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. పెదాలు ఫ్రెష్ గా మరియు పింక్ గా మారుతాయి. ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి కొత్త కణాలు ఏర్పడుతాయి. దీన్ని ఇన్ స్టాంట్ షుగర్ స్ర్కబ్ గా తయారుచేసుకోవచ్చు. నిమ్మరసంలో కొద్దిగా షుగర్ వేసి మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

పసుపు మరియు నట్ మగ్ పేస్ట్ :
పసుపు మరియు నట్ మగ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఇది పెదాల మీద ఉండే బ్లాక్ స్పాట్స్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పెదాల మీద డ్రైనెస్ తొలగిస్తుంది. తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్ :
పెదాల మీద బ్లాక్ స్పాట్స్ తొలగించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను లిప్ బామ్ గా ..మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల బ్లాక్ స్పాట్స్ కనబడకుండా పెదాలు అందంగా కనబడుతాయి .



Click it and Unblock the Notifications
