Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
కళ్ళ క్రింద ముడుతలను మాయం చేసే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
కళ్ళ క్రింద నల్లని వలయాలు మరియు చారలను నివారించడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్స్ మరియు కాస్మోటిక్స్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు.
కళ్ళ క్రింది భాగంలో ముడుతలు ఉన్నాయంటే ముఖ అందాన్ని మరియు లుక్స్ ను పాడు చేసేస్తుంది. ఈ ముడుతలనేవి చర్మ సమస్యల్లో ఒకటి, ఇవి చిన్న వయస్సులోనే కనబడుటకు ప్రధాణ కారణం డ్రై స్కిన్ మరియు హానికరమైన సూర్యకిరణాలు ముఖం మరియు శరీరం మీద పడటం. వయస్సు పెరుగుట వల్ల కూడా కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుటకు ముఖ్య కారణం.

కళ్ళ క్రింద చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల చాలా తర్వాత సులభంగా ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ఏర్పడుటకు కారణం అవుతుంది . కాబట్టి, ఇలా కళ్ళ క్రింది నల్లని వలయాలు ఏర్పడాటానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కళ్ళ క్రింద నల్లని వలయాలు మరియు చారలను నివారించడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్స్ మరియు కాస్మోటిక్స్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇలా ఖర్చు చేసి తీసుకొనే ట్రీట్మెంట్స్ మరియు రసాయనిక ప్రొడక్ట్స్ కంటే మనం ఇంట్లో నేచురల్ గా ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ మరింత ఎఫెక్టివ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి.
అలాంటే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను కొన్నింటిని మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాము. ఇవి ముఖంలో మచ్చలు మరియు నల్లని వలయాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. మరి ఆ హోం రెమెడీస్ తెలుసుకుందాం...

ఐస్ ప్యాక్:
ఐస్ ముక్కను చిన్న కాటన్ వస్త్రంలో తీసుకొని మడచి కళ్ళ మీద పెట్టుకోవాలి. అంతే కాదు అదే ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకోవచ్చు. దాంతో కళ్ళ అలసట నుండి ఉపశమనం పొది ఫ్రెష్ గా కనబడుతాయి. ఆ చల్లదనం మిమ్మల్ని కంటి నిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ చర్మ రక్షణలో తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి రెండు కాటన్ బాల్స్ (పత్తి ఉండలు)రోజ్ వాటర్ లో ముంచి అలసిన కళ్ళ మీద పెట్టుకోవాలి. తర్వాత అలాగే స్ట్రెయిట్ గా వెనకకు కూర్చొని, పది నిముషాల పాటు ఏదైనా మ్యూజిక్ వింటూ విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఐస్ ప్యాక్ ను తొలగించిన తర్వాత మీ కళ్ళు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

కీరదోశకాయతో ఐస్ ప్యాక్:
కళ్ళ మీద రెండు చక్రాలాంటి కీరదోశకాయ ముక్కలను రెండు కళ్ళమీద పెట్టి పది పదిహేను నిముషాల పాటు కళ్ళు మూసుకొని విశ్రాంతి పొందడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మాన్ని కీరదోస చల్లబరిచి, ముడుతలను పోగొడుతుంది.

సాండిల్ వుడ్ ఐప్యాక్:
చర్మానికి సాండిల్ వుడ్ పేస్ట్ చాలా సున్నితమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న చర్మానికి రక్షణ కల్పించి ప్రకాశవంతంగా మార్చుతాయి. కాబట్టి కొంచెం సాండిల్ వుడ్ పేసట్ కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల అలసిన చర్మం తొలగిపోయి ఫ్రెష్ గా కనబడుతారు.

నిమ్మరసం:
నిమ్మకాయ గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్. నిమ్మకాయను ముక్కతో కళ్ళ చుట్టూ రుద్దడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి. కళ్ళ క్రింద ఉబ్బెత్తుగా ఉన్నా, ఆప్రదేశంలో కొంచెం నిమ్మరసాన్ని రాయడం చాల ముఖ్యం. కళ్ళ చూట్టూ ఉన్న అలసిన చర్మం ఉపశమనం కలిగించే కొన్ని యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

బంగాళాదుంప
బంగాళాదుంప తురుము రెండు టీస్పూన్లు, తేనె తగినంత తీసుకోవాలి. ముందుగా బంగాళాదుంప తురుమును ఐస్ వాటర్‌లో ఐదు నిమిషాలపాటు ఉంచి తీసేయాలి. దాంట్లో సరిపడా తేనెను కలిపి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్లచుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు కళ్లుమూసుకుని రిలాక్స్‌గా పడుకోవాలి. తరువాత శుభ్రమైన చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే కళ్లచుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను క్రమంగా తగ్గించుకోవచ్చు.

బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి
అలాగే ఉదయాన్నే రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను కళ్ళచుట్టూ రాసి కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే, క్రమంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

నాలుగు చుక్కల పాలు కలిపి
కమలాపండు రసంలో నాలుగు చుక్కల పాలు కలిపి కళ్ళక్రింద సున్నితంగా రాయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.ఈ చిట్కాలు మీ అలసిన కళ్ళకు ఉపశమనం కలిగించి, మీ కళ్ళను ప్రకాశవంతంగా మార్చుతాయి. అలసిన కళ్ళు మీద ఎక్కువ మేకప్ ను ధరించకూడదు.



Click it and Unblock the Notifications