Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీరు తెలుసుకోవాల్సిన 7 అద్భుతమైన ఫ్రెంచ్ అందాల చిట్కాలు
మీరు తెలుసుకోవాల్సిన 7 అద్భుతమైన ఫ్రెంచ్ అందాల చిట్కాలు
సహజ సౌందర్యానికి, చర్మ సంరక్షణకి ఫ్రెంచ్ యువతులు పెట్టింది పేరు.వాళ్ళ మెరిసే చర్మం, కాంతివంతమైన ముఖం, అన్నిటికన్నా ముఖ్యంగా రహస్య సౌందర్య చిట్కాలు వీటికి ఎంతో ప్రసిద్ధి చెందారు. కానీ వారు అంత ప్రత్యేకంగా ఎలా వుంటారు? వారి చర్మం ఎలా అంత అందంగా ఉంటుంది? వారి అందాల రహస్యం ఏంటి?
అదేం రాకెట్ సైన్స్ కాదు.. ఫ్రెంచ్ యువతులు సింపుల్ గా తమ బేసిక్స్ పై ఎక్కువ ధ్యాస పెడతారు. క్లిష్టమైన భారీ లేదా గాఢమైన మేకప్ లు, అందాల ట్రీట్మెంట్లకి దూరంగా ఉంటారు. వారు అన్నిటిని సింపుల్..నిజంగా సింపుల్ గా ఉంచుతారు. అదే వారిని అందంగా మలుస్తుంది. ఎందుకంటే సాదాతనమే అన్నిటికన్నా మంచిది కదా.

మీక్కూడా ఈ విషయాలు సింపుల్ గా చేయటానికి మేము ఇక్కడ కొన్ని అద్భుతమైన ఫ్రెంచ్ అందాల చిట్కాలను పొందుపరిచాం. ఇవి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చి, కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
1.ఫ్రెంచ్ యువతులు వయస్సు మీరటం గురించి పెద్దగా ఆలోచించరు
దీనికి కారణం ఫ్రెంచ్ వారు సాధారణంగా వయస్సు మీరే లక్షణాల గురించి పెద్దగా పట్టించుకోరు. వారికి ఏ వయస్సులోనైనా అందంగా ఉంటామనే అన్పిస్తుంది. వయస్సు పైబడటం గురించి కానీ, ముడతలు లేదా జుట్టు నెరవడం గురించి కానీ అస్సలు భయపడరు.
మార్కెట్లో దొరికే యాంటీ ఏజింగ్ క్రీములు, లోషన్ల కన్నా సహజ నూనెలు, తేనెను వారి చర్మానికి వాడటాన్ని ఇష్టపడతారు. ఖరీదైన చర్మ చికిత్సల జోలికి పోవటం కన్నా, సహజ పద్ధతి అంటే చాలా పళ్ళు,కూరలు తినటం, తమ ఆరోగ్యం నిలుపుకోవటం, చర్మం మెరిసేలా చేసుకోవటం ఇలా అన్నీ సహజపద్ధతుల్లో చేస్తారు.

2.కఠినమైన క్లెన్సర్లను వాడరు
ఇది…నిజమే.ఫ్రెంఛ్ వారు ఏ కఠినమైన క్లెన్సర్ లేదా బాడీవాష్ లను వాడరు. వారు తక్కువ రసాయనాలున్న లేదా సహజ ఉత్పత్తులనే వాడతారు. ఏ ఫ్రెంచ్ యువతి బ్యాగులేదా బ్యూటీ కిట్ లో మీరెప్పుడూ కఠినమైన క్లెన్సర్ ను చూడరు. వారి అందమైన చర్మానికి కారణం దానిపై ఏ రసాయన ప్రభావం లేకపోవడమే.
3. అతి మేకప్ కన్నా సహజ లుక్ ను ఇష్టపడతారు
మీకెప్పుడైనా ఫ్రెంచ్ యువతి బ్యూటీకిట్ లోకి తొంగిచూసే అవకాశం వస్తే, అక్కడ ఉండే అన్ని సహజ ఉత్పత్తులను చూసి ఆశ్చర్యంలో మునిగిపోతారు. వారు బాగా తయారయినప్పుడు కూడా చాలా తక్కువ మేకప్ ను ఇష్టపడతారు, దాని వలన సహజ సౌందర్యం ఎక్కువగా కన్పిస్తుంది. మరో కారణం వారి ముఖమే సహజంగా అందంగా ఉంటుంది. ఎంత తక్కువ మేకప్ వేసుకుంటే…అంత అందంగా కన్పించే అవకాశం ఉంటుంది.

4.వారి జుట్టును టైట్ గా బిగించి ముడిపెట్టరు
ఇది మనందరం ఫ్రెంచ్ వారి నుంచి నేర్చుకోవాలి. వారు ఇంట్లో వున్నా, బయటకెళ్ళినా జుట్టు ఎప్పుడూ విరబోసుకుని,దానికి గాలాడేటట్టు చేస్తారు. ఒకవేళ ముడిపెట్టాల్సి వచ్చినా, టైట్ గా కట్టకుండా ఉండేలా చూస్తారు. లూజ్ గా మెస్సీ బన్ లా పెట్టుకోవటం వల్ల చాలా స్మార్ట్ గా కూడా కన్పిస్తారు. టైట్ గా జుట్టును ముడిపెట్టకపోవటం అంటే తక్కువ లేదా అసలు వెంట్రుకలు విరిగిపోకుండా ఉండటం.
5.చర్మ సంరక్షణ వారికి అన్నిటికన్నా ముఖ్యం
ఫ్రెంచ్ యువతులు తమ చేతులు, పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోటాన్ని ఇష్టపడతారు. కానీ అది ఎలా చేస్తారు? పెద్ద రహస్య పద్ధతి ఏం కాదు. ఇదిగో ఆ పద్ధతి- కొంచెం సీ సాల్ట్ ను తీసుకుని కొంచెం ఆలివ్ నూనె లేదా బాదం నూనె (మీకేది నచ్చితే అది లేదా ఇంట్లో ఉన్నది) కలిపి మీ చేతులకి ఆ మిశ్రమాన్ని పట్టించి 5నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా ఇలా ప్రతిరోజూ చేయండి.
ఇది ప్రతిరోజూ అలవాటుగా చేసుకుని తేడా మీరే చూడండి. ఫ్రెంఛ్ వారి మరో అందాల రహస్యం నెయిల్ పాలిష్ ను అన్ని సమయాల్లో వేసుకోవక్కర్లేదు. వారు వారి గోళ్లను నెయిల్ పాలిష్ లేకుండా సహజంగా వదిలేసి, ఆలివ్ నూనె స్క్రబ్ ను వాడతారు.

మీ చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటడ్ గా ఉంచుకోండి. ఈ నియమాన్ని ఫ్రెంచ్ స్త్రీలు దాదాపు అందరూ పాటిస్తారు, దీనివలనే వారి చర్మం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. ఒక సింపుల్ కారణం- ఎవరైనా ఎక్కువ నీళ్ళు తాగాలి, ఇది లోపలినుంచి, బయటనుంచి కూడా ఆరోగ్యకరమైనది. అందుకని మీ చర్మం కూడా ఫ్రెంచ్ వారిలాగా సహజంగా మెరవాలంటే, చాలా నీళ్ళు తాగండి.
7.వైన్ కి ఎప్పుడూ నో చెప్పద్దు
ఫ్రెంఛ్ వారికి వైన్ తాగటం ఎంత ఇష్టమో రహస్యం కాదు. ప్రతి ఫ్రెంఛ్ లంచ్ లేదా డిన్నర్ లో వైన్ భాగం..నిజానికి బ్రేక్ ఫాస్ట్ లో కూడా. మీకు తెలీనిది ఏంటంటే వైన్, ప్రత్యేకంగా రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వయస్సు మీరే లక్షణాలను దూరంగా ఉంచుతాయి…



Click it and Unblock the Notifications
