Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఆలియా మాదిరిగా మరింత అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాలో అవ్వండి...
ఆలియా భట్ మాదిరిగా మీరు హాట్ సారీ, రెడ్ లిప్స్ మేకప్ లుక్ లో కనిపించాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అందానికి మారుపేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సహజమైన సౌందర్యంతో బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకుంది. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తన లుక్స్ మరియు ఫ్యాషన్ సెన్స్ తో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకుంది.

తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్లో అందమైన చీర కట్టులో మరింత హాట్ గా కనిపించింది. ముఖ్యంగా తెల్లని చీరలో అందాలను ఆరబోసింది. అంతేకాదండోయ్ రెడ్ లిప్స్ తో తన బ్యూటీ డోస్ మరింత పెంచేసింది. RRR టీజర్లోనూ ఎంతో అందంగా కనిపించిన ఆలియా సోయగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సందర్భంగా ఆలియా భట్ లా మీరు కనిపించాలని ఆలోచిస్తున్నారా? అదెలా అనుకుంటున్నారా? ఇలా తయారవ్వడం చాలా సులభమే. ఇంతకీ ఆలియా భట్ లుక్ ను ఎలా రీక్రియేట్ చేయాలో ఇప్పుడే చూసెయ్యండి.

మేకప్ కు ముందు..
* ఆలియా భట్ తన సహాజమైన సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా తన మాదిరిగా అందంగా కనిపించాలంటే.. ముందుగా మీ ఫేసును మంచి నీటితో శుభ్రం చేసుకోండి. దానిపై ఫౌండేషన్ కు బదులుగా బీబీ క్రీమ్ ను వాడొచ్చు. ఈ క్రీమ్ ఎవరి ముఖం మీద అయినా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. మీ ముఖంపై బీబీ క్రీమ్ అప్లై చేసిన తర్వాత, కళ్ల దగ్గర సిల్వర్ ఐ షాడో వేయండి. ఐషాడో అప్లై చేసిన తర్వాత, మస్కరా అప్లై చేసి మీ మేకప్ ను పూర్తి చేయండి. ఆ తర్వాత కనుబొమ్మలను సరిదిద్దుకోండి.

ఫేసులో గ్లో రావడానికి..
ఐ మేకప్ తర్వాత, చెక్కిళ్లు, పెదవుల దగ్గర హైలైటర్ ని అప్లై చేయండి. ఇలా హైలైటర్ ని అప్లై చేయడం వల్ల మీ ముఖంలో మెరుపు వస్తుంది. ఇక న్యాచురల్ లుక్ కోసం పింక్ బ్లష్ అప్లై చేయండి.
ఇవన్నీ పూర్తయిన తర్వాత రెడ్ కలర్ లిప్ స్టిక్ ను అప్లై చేయడం ద్వారా మీ మేకప్ పూర్తి చేయండి.

సరికొత్త లుక్..
ఆ తర్వాత ఆలియా భట్ మాదిరిగా తెల్లని చీరను ధరించండి. ఇక హెయిర్ స్టైల్ సాధారణంగా ఉంచుకోండి. హెయిర్ స్టైల్ కోసం సెంటర్ డిమాండ్ ను తీసేసి, తక్కువ బన్ ను రెడీ చేయండి. ఆ తర్వాత బన్ యొక్క ఒక వైపున వైట్ రోజ్ ను ఉంచండి. అంతే మీరు కూడా ఆలియా మాదిరిగా ప్రత్యేకంగా కనిపిస్తారు.

అందాన్ని కాపాడుకునేందుకు..
ఆలియా భట్ తన అందంతో పాటు తన ఫిగర్ ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ యోగా మరియు జిమ్ చేస్తుంది. అలాగే తను రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేయండి. కెమికల్స్ ఉత్పత్తులను ఎక్కువగా వాడకండి. ఇంకా తన మెరిసే చర్మ రహస్యం ఏంటంటే.. తను ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగుతుంది. తను రోజు కచ్చితగా ఎనిమిది గ్లాసుల నీరు తాగుతుందట. అందుకే ఆమె ముఖం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీని వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
