మంగళవారం మీ రాశిఫలాలు (28-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 28, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా ఈరోజు ప్రణాళిక ప్రకారం పని చేస్తారు. మరోవైపు మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు, మీరు మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు పరిపూర్ణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి కారణం పనిభారం కావచ్చు. అధిక పని కారణంగా ఈ రోజు మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేరు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకోకపోవడం మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు దాదాపు ప్రతి సందర్భంలోనూ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. సామాజిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పని ప్రదేశంలో ఈరోజు ఈ సమస్యలన్నింటినీ అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నేడు, ఆర్థిక సమస్య ఉండదు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ రోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది, శారీరకంగా మరియు మానసికంగా మీరు ఈ రోజు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీ జీతం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, మీ పనిని సీనియర్ అధికారులు ఎంతో అభినందిస్తారు. వ్యాపారులు కూడా ఆర్థికంగా లాభపడతారు. మీరు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే, ఈ పని ప్రారంభించడానికి ఈ రోజు గొప్ప రోజు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా కాలం తరువాత మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ క్షణాలను ఆనందిస్తారు. మీ ప్రియమైన వారితో గడిపిన ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బహుశా ఈ రోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు మీ పనిని పూర్తి ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. మరోవైపు వ్యాపారులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఎవరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఈ రోజు మీరు నిరాశ చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో జరుగుతున్న పాలిటిక్స్ కు దూరంగా ఉండండి. మీ స్వంత వ్యాపారాన్ని కొనసాగించడం మీకు మంచిది. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృథా చేయవద్దు. వ్యాపారులు ఈరోజు చాలా తెలివిగా ప్రయత్నించాలి. లేదంటే ప్రతికూల విషయాలు మీ పనితీరును ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పనిలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులు ఈరోజు చాలా ఓపికగా పని చేయాలి. ఎందుకంటే, ఈ రోజు, మీ పనిలో చాలా ఆటంకాలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా శాంతియుతంగా మరియు తెలివిగా పనిచేయాలి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉండదు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కష్టపడి, నిజాయితీగా పని చేయాలి. రాబోయే రోజుల్లో మీరు ఎక్కువ ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మీకు కొత్త శక్తి మరియు వెచ్చదనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఆరోగ్యం బాగాలేకపోతే, మీ కుటుంబం మరియు స్నేహితులతో గడపడం మంచిది. మరికొన్ని వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు మీ పనులలో వేగం పెంచాలి. మీరు నెమ్మదిగా పనిచేస్తూ ఉంటే చాలా పనులు పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు తొందరపడకూడదు. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : సాయంత్రం 5:45 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కోరుకున్న చోటుకు బదిలీ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, మీరు విదేశాలలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తుంటే, ఈ రోజు మీరు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న ప్రజలకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో అంతా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో ప్రతికూలంగా ఉంటుంది. కొంత నష్టం కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీపై ఒత్తిడి పెరుగుతుంటే, మీరు రోజూ ధ్యానం చేయాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని గొప్ప బేరసారాలు పొందవచ్చు. అలాగే, కొత్త ప్రాజెక్ట్‌లో పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచిది. మీరు నిరుద్యోగులై, చాలాకాలంగా ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే, మీ కృషికి ఫలితం లభించే అవకాశం ఉంది. మీరు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Desktop Bottom Promotion