Latest Updates
-
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.!
శిల్పా శెట్టి తన డ్రెస్ మరియు నగలతో మోడ్రన్ డే క్లియో పాత్ర లుక్ తో మెరిసిపోయింది
శిల్పా శెట్టి కుంద్రా తరచుగా ఫ్యూజన్ శారీస్ ధరిస్తూ, ఎక్కువగా విమర్శలపాలవుతూ ఉండేది. కానీ ఇప్పుడు తన సహజ శైలికి భిన్నంగా, డైనమిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ధరిస్తూ విమర్శనాస్త్రాలకు చెక్ పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. ఆమె సాధారణంగా అనుసరించే, శారీస్, గౌన్స్ వంటి డ్రెస్సుల నుండి, ఊరటగా ఎంబ్రాయిడరీ స్టేట్మెంట్స్ అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. విమర్శకుల నోటికి తాళమెయ్యడమే కాకుండా, క్లియోపాత్రా వైబ్స్ టచ్ ఇస్తూ, ప్రశంశలను మూటకట్టుకుంటూ ఉంది. ఇక ఆమె దుస్తులను మరియు మేకప్ ను డీకోడ్ చేద్దాం.

డిజైనర్ యూసుఫ్ అల్ జాస్మి రూపొందించిన ఈ దుస్తులు, హాల్టర్ - నెక్ (మెడకు అనుసంధానించబడి ఉన్నట్లుగా)మోడల్లో స్లిట్ స్లీవ్స్ మరియు గ్లిట్టరీ మెటాలిక్ యాక్సెంట్స్ జోడించి డిజైన్ చేయబడి ఉన్నాయి. సిల్వర్ జ్యూయలరీతో అలంకరించబడి, పారదర్సకతతో కూడిన ఈ దుస్తులు, ఫ్రంట్ స్లిట్ కలిగి అబ్బురపరచేలా ఉన్నాయి. దీనికి తోడుగా శిల్పా శెట్టి, క్రిస్టియన్ లోబోటిన్ నుండి వచ్చిన స్పార్క్లీ పీప్-హోల్ చెప్పులను తన దుస్తులకు జోడించారు.

ఆభరణాల కిందకు వస్తే, దీపా గుర్నాని రూపొందించిన రత్నాలతో పొదిగిన గాజులు, ఎపోనిమస్ లేబుల్ నుండి వచ్చిన హెడ్ గేర్ బాండ్, శిల్పా శెట్టి దుస్తులకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక మేకప్ గురించి మాట్లాడితే, డూయీ టోన్డ్ మేకప్ తో, మెరూన్ కలర్ లిప్ షేడ్, కోహ్ల్ మరియు న్యూడ్ ఐ-షాడో ధరించి, భుజాల మీద జాలువారేలా జుట్టును వదిలి, మేకప్ ఫినిష్ చేసింది. తన సహజ రీతికి భిన్నంగా, ముస్తాబైన శిల్పా శెట్టి కుంద్రా, ఈసారి విమర్శనాస్త్రాలకు బదులుగా, అభిమానుల ప్రశంసలను అందుకుంటూ ఉంది. ఆమె దుస్తులు మరియు లుక్ గురించి, మీ ఆలోచన ఎలా ఉంది? వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
