Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Lakme Fashion Week 2023: స్టన్నింగ్ డ్రెస్సుల్లో నేహా ధూపియా, రకుల్.. లాక్మే ఫ్యాషన్ వీక్‌కు అదిరిపోయే ఆరంభం
వందలాది బ్రాండ్ లు, డిజైనర్లు, పరిశ్రమల వాటాదారులను కలిగి ఉన్న లాక్మే ఫ్యాషన్ ఈవెంట్, ఫ్యాషన్ లో వస్తున్న నూతన ట్రెండ్ ను పరిచయం చేయనుంది. చాలా మంది ఫ్యాషన్ డిజైనర్లకు లాక్మే ఫ్యాషన్ వీక్ ఓ మంచి అవకాశంగా నిలుస్తుంది.
దేశవ్యాప్త ఫ్యాషన్ సంరంభం మొదలైంది. ముంబయి లోని జియో వరల్డ్ గార్డెన్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ ప్రారంభమైంది. మార్చి 9వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు ఈ ఫ్యాషన్ ఈవెంట్ జరగనుంది. బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియాతో ఈ ఫ్యాషన్ వేడుక మొదలైంది. మార్చి 12వ తేదీన మనీష్ మల్హోత్రా యొక్క కలెక్షన్ ఎగ్జిబిషన్ తో ముగుస్తుంది.

వందలాది బ్రాండ్ లు, డిజైనర్లు, పరిశ్రమల వాటాదారులను కలిగి ఉన్న లాక్మే ఫ్యాషన్ ఈవెంట్, ఫ్యాషన్ లో వస్తున్న నూతన ట్రెండ్ ను పరిచయం చేయనుంది. చాలా మంది ఫ్యాషన్ డిజైనర్లకు ఇదో మంచి అవకాశంగా నిలుస్తుంది.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాహుల్ మిశ్రా, పెరోకు చెందిన అనీత్ అరోరా, కల్లోల్ దత్తా, కృతి తులా, రుద్రాక్ష్ ద్వివేది, సుధీర్ రాజ్ భర్, మసాబా గుప్తా, భవ్య గోయెంకా సహా ఇతర ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు తమ కొత్త ట్రెండీ దుస్తులను ప్రదర్శించనున్నారు.

మొదటి రోజు ఉదయం నేహా ధూపియా ర్యాంప్ పై హొయలు పోయింది. లేలేత రంగు దుస్తులు ధరించింది. ఈ గౌనుతో ఉన్న బెల్ట్ ను జత చేసింది. ఈ ఔట్ ఫిట్ లో నేహా ధూపియా చాలా ఆత్మవిశ్వాసంగా కనిపించింది. ట్రెండీ గా ఉన్న డ్రెస్.. లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 కు చక్కని ప్రారంభంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో మొదటి రోజు రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెరిసింది. రుకల్ లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ ర్యాంప్ పై తన బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేసింది. ఈవినింగ్ ఈవెంట్ లో షో స్టాపర్ గా నిలిచింది. రకుల్ ధరించిన ఈ ఔట్ ఫిట్ ను శృతిసంచేటి తీర్చిదిద్దారు.

వైట్ బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో రకుల్ అందం రెట్టింపు అయింది. హై థై ఫోజులో రకుల్ అప్సరసలా కనిపించింది.

నాలుగు రోజుల పాటు జరగనున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లైవ్ ను Jio TV తో పాటు Voot లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.



Click it and Unblock the Notifications
