For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిక్ ఎక్కించే కియారా అందాలను చూస్తే మీ చూపు తిప్పుకోలేరు... అమ్మాయిలూ అస్సలు మిస్ అవ్వొద్దు...!

|

మహేష్ బాబుతో కలిసి భరత్ అను నేను చిత్రంలో ఎంతో సంప్రదాయ బద్ధంగా కనిపించింది కియారా అద్వానీ. అంతే కాదు వినయ విధేయ రామ చిత్రంలోనూ నటించి తెలుగు ప్రజలకు బాగా దగ్గరైంది. అంతకుముందు ఈ భామ ఎం.ఎస్.ధోనీ చిత్రంతో తన నట ప్రతిభ ఏంటో చాటి చెప్పింది.

అంతేకాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలోనూ కథానాయికగా మంచి మార్కులే కొట్టేసింది. ఈ బాలీవుడ్ భామ సిల్వర్ స్క్రీన్స్ పై ఫాలో అయ్యే ఫ్యాషన్స్ అమ్మాయిలందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ వెండి తెరపైనే కాదు..

తన నిజ జీవితంలో కూడా సందర్భానికి తగినట్టు ఫ్యాషన్ డ్రస్ లు వేసుకుంటూ అందరి చూపులను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ అందాల భామ బ్రైడల్ లుక్స్ లో ఓ ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన లెహెంగా డిజైన్స్ అమ్మాయిల మదిని దోచేలా కనిపిస్తున్నాయి. కియారా అద్వానీ ధరించిన టాప్ అవుట్ ఫిట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి...

లెహెంగా డ్రెస్ లో..

లెహెంగా డ్రెస్ లో..

కియారా అద్వానీ ఇటీవల తన స్నేహితుడి వివాహ వేడుకలకు వెళ్లింది. అక్కడ తోడు పెళ్లి కూతురు పాత్రలో బిజీగా మారిపోయిందట. ఆ సమయంలో ఈ బాలీవుడ్ అందాల భామ ధరించిన లెహెంగా డ్రెస్ లో అందరి మదిని దోచుకుంది.

కుందనపు బొమ్మలా..

కుందనపు బొమ్మలా..

కియారా అద్వానీ ఈ లెహెంగా డ్రెస్ లో అచ్చం కుందనపు బొమ్మలా కనిపించింది. ఈ ఫొటోలను కూడా తన ఇన్ స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో పోస్ట్ చేసింది.

డైమండ్ జ్యువెలరీ..

డైమండ్ జ్యువెలరీ..

మహేష్ బాబు సినిమాలో సాంప్రదాయ హీరోయిన్ గా నటించిన ఈ భామ తన నిజ జీవితంలో మాత్రం ఫ్యాషనబుల్ డ్రస్సులు వేసుకుంటూ అందరి చూపు తన వైపును తిప్పుకుంటోంది. తాజాగా ఆమె ధరించిన లెహెంగా డ్రస్సుకు డైమండ్ జ్యువెలరీ జత చేసి మత్తెక్కించే మెరుపులా మెరిసిపోయింది.

ఫస్ట్ లుక్ లో...

ఫస్ట్ లుక్ లో...

ఫస్ట్ లుక్ లో దుబాయ్ కు చెందిన డిజైనర్ ఫరాజ్ మనన్ అందమైన సిల్వర్ లెహెంగా-చోలి కాంబోలో అందరినీ కనువిందు చేసింది. స్లీవ్ లెస్ చోలి వి-నైక్ లైన్ తో విశాలమైన ఎంబ్రాయిడరీ డ్రస్సును ధరించి అదరగొట్టింది.

సెకండ్ లుక్ లో..

సెకండ్ లుక్ లో..

రెండోసారి పింక్ కలర్ డ్రస్ లో ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. ఇాది పూర్తి స్లీవ్ చోలితో నిండిపోయింది. దీనికి అద్భుతమైన డైమండ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ తో పాటు వెండి మరియు బంగారు కోట్ తో తన రూపాన్ని ముగించింది.

దేవ కన్యలా..

దేవ కన్యలా..

వైట్ కలర్ డ్రస్సులు ఎవరు ధరించినా.. చాలా అందంగా మెరిసిపోవడం.. ముఖ్యంగా దేవ కన్యలా కనిపించడం అనేది అతి కొద్ది మందికే సాధ్యమవుతుంది. మంచి డిజైనర్ లెహెంగా ధరిస్తే ఎలా ఉంటుందో కియారా అద్వానీని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. స్లీవ్ లెస్ టాప్, సీక్వెన్ వర్క్ ఉన్న లెహెంగాకు డైమండ్ జ్యువెలరీ జత చేసి సింపుల్ హెయిర్ స్టైల్ తో ఎంత అందంగా కనిపిస్తోందో కదూ...

పార్టీలకు ఇలా వెళ్తే...

పార్టీలకు ఇలా వెళ్తే...

వైట్ కలర్ అవుట్ ఫిట్స్ మిర్రర్ వర్క్ ఉంటే దానికి వచ్చే లుక్కే వేరు. అదీ కూడా నైట్ టైమ్ లో జరిగే ఫంక్షన్లకు, పార్టీలకు ఇలాంటి డ్రస్ వేసుకెళ్తే ఎలా ఉంటుందో ఈ అందాల భామను చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ భామ అవుట్ ఫిట్స్ కి జతగా గాజులతో పాటు చక్కని చోకర్ కూడా పెట్టుకుంది.

మంచి లుక్స్..

మంచి లుక్స్..

కియారా అద్వానీ ధరించిన ఈ లెహెంగా డ్రస్ అద్భుతంగా ఉంది కదూ.. ఈ లెహెంగాపై పెద్దగా వర్క్ ఏమీ లేకపోయినా దానిపై ఉన్న ఫ్లోరల్ డిజైన్స్ మాత్రం ఆ డ్రస్ కి మంచి లుక్స్ తెచ్చి పెట్టాయి. ఇక డ్రస్ కి మ్యాచింగ్ గా కియారా ధరించిన చోకర్ అయితే చాలా హైలెట్ గా కనిపిస్తుంది.

All Images Credited to Kiara Insta

English summary

Kiara Advani's photo shoot is going viral and you can't miss it

Here we talking about Kiara Advani's photo shoot is going viral and you can't miss it. Take a look