Latest Updates
-
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
చాలామంది మలబద్ధకాన్ని కేవలం జీర్ణ సమస్యగా మాత్రమే కొట్టిపారేస్తుంటారు. అయితే న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా ఓ ఇంటర్వ్యూలో..మలబద్ధకం అనేది కేవలం కడుపులో అసౌకర్యానికి మాత్రమే పరిమితం కాదని.. ఇది ముఖంపై మొటిమలు రావడానికి కూడా ప్రధాన కారణం అవుతుందన్నారు. కడుపు శుభ్రంగా లేకపోతే, దాని ప్రత్యక్ష ప్రభావం మన పేగుల ఆరోగ్యం, చర్మ సౌందర్యం, హార్మోన్ల సమతుల్యతపై పడుతుందట.
మరి కడుపుని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్లు, పోషకాహార నిపుణులు చెబుతున్న ఏకైక మంత్రం.. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. జీర్ణక్రియను మెరుగుపరిచి, వ్యర్థాలను సులభంగా బయటకు పంపే ఆ అద్భుతమైన ఆహారాలు ఏమిటో ఇక్కడ చూడండి.

బొప్పాయి
బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు ఒక వరం లాంటిది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పుష్కలమైన ఫైబర్, పేగుల్లో పేరుకుపోయిన మొండి వ్యర్థాలను సైతం శుభ్రపరుస్తుంది. పచ్చి బొప్పాయి లేదా పండిన బొప్పాయిని తరచుగా తినడం వల్ల పెద్దప్రేగు శుభ్రపడి, మీ జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది.

నానబెట్టిన ఎండుద్రాక్షలు
రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే తినే ఎండుద్రాక్షలు లేదా కిస్మిస్ సహజసిద్ధమైన మందులా పనిచేస్తాయి. ఎండుద్రాక్షలో సార్బిటాల్ అనే మూలకం ఉంటుంది. ఇది పేగులలోకి నీటిని ఆకర్షించి, గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల మలం మృదువుగా మారి, ఎలాంటి కష్టం లేకుండా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. రోజూ గుప్పెడు నానబెట్టిన కిస్మిస్ తినడం వల్ల కడుపు శుభ్రపడటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
ఆకుకూరలు
కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆకుకూరలు చేసే మేలు అంతా ఇంతా కాదు. పాలకూర వంటి ముదురు ఆకుపచ్చని కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా నిండి ఉంటుంది. ఫైబర్ తో పాటు ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఏ వంటి ఎన్నో అమూల్యమైన పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి. ఆకుకూరల్లో ఉండే ఒక ప్రత్యేకమైన మూలకం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
