Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్!
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
నాన్ వెజ్ లో ఎక్కువమంది తినడానికి ఇష్టపడేవాటిలో చికెన్ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటుంది. చికెన్ తో రకరకాల వెరైటీలు చేసుకొని తింటుంటారు, చికెన్ తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు చికెన్ తినడం ద్వారా మన శరీరానికి అందుతాయి. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ వల్ల మన శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.

హై ప్రొటీన్
చికెన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రొటీన్. ఇందులో హై క్వాలిటీ ప్రొటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జిమ్ కు వెళ్లే వారు, స్పోర్ట్స్ ఆడేవాళ్లు చికెన్ బ్రెస్ట్ ను తమ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవడానికి ఇదే మెయిన్ రీజన్.
మెరుగైన ఎనర్జీ
రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే చికెన్ మీకు మేలు చేస్తుంది. ఇందులో నియాసిన్ (విటమిన్ B3), విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉండగలుగుతారు.
బరువు నియంత్రణ
చికెన్ తింటే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే. సరైన పద్ధతిలో వండుకుని తింటే ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చికెన్ లోని ప్రొటీన్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పదే పదే ఆకలి వేయదు. ఫలితంగా బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
ఎముకలకు బలం
శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి కేవలం పాలు తాగితేనే సరిపోదు. చికెన్ లో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఫాస్పరస్, కాల్షియం వంటి మినరల్స్ తగిన మోతాదులో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడమే కాకుండా, ఎముకల బలహీనతను తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యం
చికెన్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B6 శరీరంలో హోమోసిస్టీన్ (Homocysteine) అనే అమైనో ఆమ్లం లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ స్థాయిలు పెరిగితే రక్తనాళాలు దెబ్బతిని గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. కాబట్టి చికెన్ తినడం వల్ల గుండెను కాపాడుకోవచ్చు.
ఇలా తింటేనే లాభం.. లేదంటే కథ మారుతుంది
చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ దీన్ని ఎలా వండుతున్నాం అనేదే ఇక్కడ అసలు పాయింట్. నూనెలో డీప్ ఫ్రై చేసిన చికెన్, మసాలాలు దట్టించి రోజూ తింటే మాత్రం లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కాబట్టి చికెన్ ప్రయోజనాలు పొందాలంటే.. ఉడకబెట్టడం, గ్రిల్ చేయడం లేదా తక్కువ నూనెతో కూరలా వండుకుని పరిమితంగా తినడం అలవాటు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
