Latest Updates
-
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం!
ఉదయం పూట ఏం తినాలి? డాక్టర్ సూచించిన 5 అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే
పొద్దున్నే నిద్రలేవగానే చాలామంది కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతంటారు. అయితే మనం తినే బ్రేక్ ఫాస్టే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతుంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎంచుకోవడం వల్ల రోజంతా చికాకుగా, బరువుగా అనిపిస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తూ, ఈ సమస్యలను దూరం చేస్తాయి. ఉదయాన్నే మిమ్మల్ని ఉత్సాహంగా, తేలికగా ఉంచే 5 అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ ల గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ఓ వీడియోలో వివరించారు. డాక్టర్ సేథీ ఏం చెప్పారో ఇక్కడ చూడండి.
గ్రీన్ టీ
ఉదయం పూట పాలు కలిపిన టీ లేదా కాఫీకి బదులుగా ఒక కప్పు గ్రీన్ టీ తాగడం మంచిదని డాక్టర్ సేథీ చెప్పారు. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించి, కడుపును శాంతపరుస్తాయి. ఇది ఉబ్బరాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తీపి కోసం పంచదారకు బదులుగా మాంక్ ఫ్రూట్ లేదా స్టీవియా కలుపుకోవచ్చు. అయితే, వీటిని కొనేటప్పుడు ఎరిథ్రిటాల్ (erythritol) లేనివి చూసి తీసుకోండి.

అవకాడో
అవకాడో కేవలం ఒక ట్రెండీ ఫుడ్ మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరం. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్ మన జీర్ణవ్యవస్థలో ఆహారం సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్యను నివారించి కడుపు ఉబ్బరం రాకుండా చూస్తుంది. అవకాడోను టోస్ట్ మీద లేదా స్మూతీ రూపంలో తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుందని డాక్టర్ సేథీ చెప్పారు.
పెరుగు
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థను ఒక కోటలా కాపాడుతాయి. ఈ మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి, గ్యాస్ ఉత్పత్తిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా పెరుగు తయారీ ప్రక్రియలో పాలలో ఉండే లాక్టోస్ చాలా వరకు బ్యాక్టీరియా ద్వారా ముందే జీర్ణం చేయబడుతుంది. కాబట్టి పాలు పడని వారు కూడా పెరుగును సులభంగా తినవచ్చు. చక్కెర లేని సాదా పెరుగును ఎంచుకోవడం బెటర్.
అరటిపండు
పేదవాడి అమృతంగా చెప్పబడే అందరికీ అందుబాటులో ఉండే అరటిపండు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఒక సూపర్ స్టార్. అరటికాయలో సమృద్ధిగా ఉండే పొటాషియం, మన శరీరంలో సోడియం (ఉప్పు) లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో సోడియం ఎక్కువైతే, అది నీటిని నిల్వ ఉంచుకొని ఉబ్బరానికి కారణమవుతుంది. అరటిపండు ఈ ప్రక్రియను అడ్డుకొని శరీరం తేలికగా ఉండేలా చేస్తుంది. ఇది తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.
సోర్ డో బ్రెడ్ (Sourdough Bread)
సాధారణ బ్రెడ్ తింటే కొందరికి ఉబ్బరంగా ఉంటుంది కానీ సోర్ డో బ్రెడ్ దీనికి భిన్నమైనది. దీని తయారీలో ఉపయోగించే పులియబెట్టే ప్రక్రియ, గోధుమలలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ముందే విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల మన జీర్ణవ్యవస్థపై భారం తగ్గి, బ్రెడ్ సులభంగా అరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications