Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు!
గంటల తరబడి కూర్చోవడం వల్ల నడుము నొప్పి, పని ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుంటాయి కదా అని చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుని లైట్ తీసుకుంటారు. కానీ, ఇక్కడే మనం అతిపెద్ద పొరపాటు చేస్తున్నాం. నొప్పి అనేది కేవలం అలసటకో, తప్పుడు భంగిమకో పరిమితం కాదు. మన శరీరంలో వచ్చే కొన్ని చిన్న నొప్పులు భవిష్యత్తులో రాబోయే పెను ముప్పుకు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ముందస్తు హెచ్చరికలు కావచ్చని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

శరీరంలో ఎక్కడైనా నొప్పి నిరంతరంగా వస్తూ, దానితో పాటు అకారణంగా బరువు తగ్గడం, విపరీతమైన అలసట, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకీ ఏయే నొప్పుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ చూడండిా.
నడుము నొప్పి
సిస్టమ్ ముందు గంటల తరబడి పనిచేయడం వల్ల నడుము నొప్పి రావడం కామనే. సుమారు 80 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ, విశ్రాంతి తీసుకున్నా, మందులు వాడినా తగ్గని దీర్ఘకాలిక నడుము నొప్పిని ప్రమాద ఘంటికగా భావించాలి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. పొత్తికడుపు లేదా నడుము నొప్పి ప్యాంక్రియాటిక్ (క్లోమగ్రంథి) క్యాన్సర్‌కు ప్రధాన లక్షణం. అలాగే రొమ్ము, ఊపిరితిత్తులు, కిడ్నీ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు కూడా ఇది ముందస్తు సంకేతం కావొచ్చు.
కడుపు నొప్పి
జంక్ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వస్తుంటుంది. అయితే, ఈ నొప్పి రోజురోజుకూ పెరుగుతూ తీవ్రమవుతుంటే సాధారణ గ్యాస్ ట్రబుల్ అని కొట్టిపారేయకండి. అండాశయ (ఓవేరియన్), పెద్దపేగు (కోలన్), కాలేయ క్యాన్సర్లకు దీర్ఘకాలిక కడుపు నొప్పి లేదా పెల్విక్ నొప్పి ఒక కీలకమైన లక్షణం.
తలనొప్పి
తలనొప్పి వస్తే కాఫీ తాగడమో, మాత్ర వేసుకోవడమో చేస్తుంటాం. కానీ, సాధారణ మందులకు ఏమాత్రం తగ్గని మొండి తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ కు సంకేతం కావొచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే లేదా పడుకున్నప్పుడు తలనొప్పి తీవ్రంగా ఉంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా పరిగణించాలని మాయో క్లినిక్ చెబుతోంది.

ఎముకలు, కీళ్ల నొప్పులు
కాళ్లు, భుజాల నొప్పులను చాలామంది కండరాలు పట్టేయడంగా పొరబడుతుంటారు. కానీ, మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ నొప్పులు బాధిస్తుంటే అప్రమత్తం కావాలి. ఎముకల్లో వచ్చే ఈ భరించలేని నొప్పి ఆస్టియోసార్కోమా (ఎముకల క్యాన్సర్) లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ కు సూచన కావొచ్చని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ హెచ్చరిస్తోంది.
ఛాతీ నొప్పి
ఛాతీలో నొప్పి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్. గుండె పరీక్షలు నార్మల్ గా వచ్చినా సరే ఛాతీలో బరువుగా, బిగుతుగా ఉంటూ నొప్పి తగ్గకపోతే క్యాన్సర్ కోణంలో ఆలోచించాలి. గట్టిగా గాలి పీల్చినప్పుడు, దగ్గినప్పుడు లేదా నవ్వినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం కావొచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్పష్టం చేస్తోంది.
శరీరం మోగించే అలారం.. నిర్లక్ష్యం వద్దు
నొప్పి అనేది మన శరీరం మోగించే ఓ అలారం వ్యవస్థ. ఏ అలారం కూడా కారణం లేకుండా మోగదు. అలాగని దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నంతమాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. కానీ, మీ శరీరం లోపల ఉన్నదో తీవ్రమైన సమస్య గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తోందని అర్థం. ఏదైనా నొప్పి 2-3 వారాలకు మించి వేధిస్తుంటే, నిద్రను దూరం చేస్తుంటే మాటిమాటికీ పెయిన్ కిల్లర్స్ వేసుకుని కాలయాపన చేయకండి. వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
