Latest Updates
-
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.?
35 సంవత్సరాలు దాటిన వాళ్లు ఈ 8 ఫుడ్స్ తింటే స్టామినాకు తిరుగుండదు!
సాధారణంగా 35 సంవత్సరాలు దాటిన తర్వాత మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వయసు పెరిగే కొద్దీ కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి కానీ శరీరంలో శక్తి మాత్రం క్రమంగా తగ్గుతుంటుంది. చిన్న పనులకే తొందరగా అలిసిపోవడం, నీరసంగా అనిపించడం లాంటి సమస్యలను ఈ వయసులో మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొంటారు. అయితే ఈ వయసులో తీసుకునే ఆహారమే మనకు అసలైన ఔషధం.

కృత్రిమ సప్లిమెంట్ల వైపు వెళ్లకుండా, సరైన ఆహారం తీసుకుంటే 35 ఏళ్లు దాటినా యువకుల తరహాలో ఉత్సాహంగా ఉండొచ్చు. మీ శరీరానికి కావలసినంత స్టామినాను అందించి, ఎల్లప్పుడూ మిమ్మల్ని యాక్టివ్ యగా ఉంచే ఆ 8 బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ జే మనోజ్ణ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
అరటిపండు
అరటిపండు మనకు అప్పటికప్పుడు తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన ఫలం. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఉదయం లేవగానే లేదా వ్యాయామానికి ముందు ఇది తింటే.. అలసటను పారద్రోలి వెంటనే శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది.
పాలు, పెరుగు
వయసు పెరిగే కొద్దీ ఎముకలు, కండరాల పటిష్టత తగ్గడం సహజం. పాలు, పెరుగులో ఉండే ప్రొటీన్, మరియు కాల్షియం కండరాల రికవరీకి, ఎముకల బలానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.
తేనె
పంచదారకు బదులుగా తేనెను వాడటం ఎంతో మేలు. ఇది ఒక అద్భుతమైన, సహజమైన ఎనర్జీ బూస్టర్. రోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే నీరసం, అలసట మాయమైపోయి రోజంతా చురుకుగా ఉంటారు.
గుడ్లు
ప్రోటీన్లకు కేరాఫ్ అడ్రస్ గుడ్డు. గుడ్డులో ప్రొటీన్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల కండరాల బలం నిలకడగా ఉండటమే కాకుండా, అద్భుతమైన ఎనర్జీ అందుతుంది.
బాదం, వాల్ నట్స్
రోజంతా ఎనర్జీతో ఉరకలేయాలంటే గుప్పెడు గింజలు తినాల్సిందే. వీటిలో ఉండే గుడ్ ఫ్యాట్స్, మరియు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు, శరీరానికి రోజంతా సరిపడా స్టామినాను ఇస్తాయి.
ఆకుకూరలు
పాలకూర, కేల్ లాంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, మాగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి బాడీలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. తద్వారా శారీరక అలసట మీ దరిచేరదు.
చేపలు
నాన్ వెజ్ తినే వారు సాల్మన్, మాకేరెల్ లాంటి చేపలను ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, స్టామినా పెంచడంలో అమోఘంగా పనిచేస్తాయి.
ఓట్స్
ఇది బ్రేక్ ఫాస్ట్ కు బెస్ట్ ఆప్షన్. ఓట్స్ లో స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెరను పెంచకుండా, నెమ్మదిగా జీర్ణమై శరీరానికి దీర్ఘకాలిక ఎనర్జీని ఇస్తూనే ఉంటాయి.
ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి
కేవలం పైన చెప్పిన ఆహారాలు తీసుకుంటేనే సరిపోదు. మీ స్టామినాను పూర్తిస్థాయిలో పెంచుకోవడానికి దానికి తోడుగా ఈ కింది జీవనశైలి మార్పులు మీరు తప్పక పాటించాలి. అప్పుడే వంద శాతం ఫలితం ఉంటుంది.
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా మీకు ఇష్టమైన ఏదైనా తేలికపాటి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ఇది మీ స్టామినాను రెట్టింపు చేస్తుంది.
నీరు: శరీరానికి సరిపడా నీళ్లు తాగండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే సగం నీరసం దానంతటదే తగ్గిపోతుంది.
నిద్ర: ప్రతిరోజూ కనీసం 8 గంటల నిరంతరాయమైన నిద్ర తప్పనిసరి. మనం నిద్రపోయే సమయంలోనే మన శరీరం డ్యామేజ్ అయిన కండరాలను రిపేర్ చేసి మళ్లీ రీఛార్జ్ అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications