Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
ఈ ఒక్క పండు చాలు..క్యాన్సర్ ప్రమాదం దూరం!
ప్రస్తుతం అనేక రకాల క్యాన్సర్ లు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. అయితే మారిన ఆహారపు అలవాట్లు,లైఫ్ స్టైల్ వంటివి క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. ప్రారంభంలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే దీనిని ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవచ్చు..అది ముదిరినంత దాకా గుర్తించకపోతే ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే. అయితే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఒక పండు కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ నిపుణులు తాజాగా జరిపిన అధ్యనంలో బయటకొచ్చిన వివరాలను ఇప్పుడు చూద్దాం.
ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి ప్రమాదాన్ని తగ్గించడంలో ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా నోరూరించే ద్రాక్ష పండ్లు కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదని.. మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో అద్భుతమైన గుణాలను తనలో దాచుకుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ ముప్పుని అడ్డుకోగలదని ఇంగ్లాం డ్‌కు చెందిన క్యాన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం లండన్ యూనివర్శిటీలో క్యాన్సర్ అండ్ గ్రేప్స్ అనే అంశంపై సైంటిస్టులు ఒక విస్తృతమైన సర్వే, అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కొంతమంది రోగులను ఎంపిక చేసి వారికి క్రమం తప్పకుండా ద్రాక్ష పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోమని సూచించారు. అదే సమయంలో వారి ఆరోగ్యంలో వస్తున్న మార్పులను, క్యాన్సర్ కణాలపై ద్రాక్ష చూపిస్తున్న ప్రభావాన్ని నిపుణులు నిశితంగా పర్యవేక్షించారు. కొన్ని నెలల పాటు సాగిన ఈ అధ్యయనం చివరిలో ఆశాజనకమైన రిజల్ట్స్ వచ్చాయి.
క్యాన్సర్ పై పోరాడే రెస్వెరాట్రాల్
ద్రాక్షలో ఈ అద్భుత ప్రయోజనానికి కారణం రెస్వెరాట్రాల్(Resveratrol) అనే శక్తివంతమైన సహజ సమ్మేళనం. ఇది ఒక రకమైన పాలీఫెనాల్. ద్రాక్ష తొక్కల్లో ముఖ్యంగా నలుపు, ఎరుపు రంగు ద్రాక్షలో ఇది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఈ రెస్వెరాట్రాల్ కు యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడంలో, అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో కొంతవరకు సహాయపడుతుందని వారి రిపోర్ట్ తెలిపింది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా, దాని ముప్పును గణనీయంగా తగ్గించగలదని వారు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య ప్రయోజనాల గని
ద్రాక్షలో రెస్వెరాట్రాల్ మాత్రమే కాదు మన శరీరానికి మేలు చేసే మరెన్నో పోషకాలు ఉన్నాయి.
-ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మన శరీరం తుప్పు పట్టకుండా కాపాడే సైనికుల్లా ఈ యాంటీఆక్సిడెంట్లు పనిచేసి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి.
-ద్రాక్షలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల బారిన పడకుండా దృఢంగా తయారవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
