Latest Updates
-
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా..
మెడ,సంకల్ల,గజ్జల్లో చర్మం నల్లబడటానికి కారణం ఇదే..ఏం చేస్తే తగ్గుతుందంటే..
మెడ దగ్గర చర్మం నల్లబడటం, మందం కావడం కొంతమందిలో మనం గమనిస్తుంటాం. కొందరికి సంకల్లో, గజ్జల్లో నల్లబడటం జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో అకాంథోసిస్ నైగ్రికన్స్(Acanthosis Nigricans) అని అంటారు. ఇది రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్(Insulin Resistance) అని హైదరాబాద్ లోని ఇమెన్స్ డయాబెటీస్, థైరాయిడ్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ దీప్తి కరేటి ఓ వీడియోలో తెలిపారు. అంటే శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ అవసరమైన దానికంటే ఎక్కువగా విడుదలవడం. ఇది ఎందుకు జరుగుతుందంటే శరీర కణాలు ఇన్సులిన్ కి రెస్పాండ్ అయ్యి బ్లడ్ లో షుగర్ లెవల్ ని తీసుకోవు కాబట్టి శరీరం ఎక్కువగా ఇన్సులిన్ తయారుచేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇన్సులిన్ అనేది మన క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఒక హార్మోన్. ఇది మనం తిన్న ఆహారంలోని చక్కెరను కణాలకు శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. అయిత, కొన్నిసార్లు మన శరీర కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ నిరోధకతను అధిగమించడానికి, క్లోమం మరింత ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. రక్తంలో ఈ అధిక ఇన్సులిన్ స్థాయిలు చర్మ కణాలను వేగంగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. ఈ అదనపు కణాలు, వాటిలోని మెలనిన్ (చర్మ రంగుకు కారణమయ్యే పదార్థం) వల్ల ఆ ప్రాంతాల్లో చర్మం నల్లగా, మందంగా, వెల్వెట్ లా మారుతుంది.

కుటుంబంలో ఎవరికైనా ఇలా ఉన్నా కూడా ఇలా జరగవచ్చని, మరికొందరికి స్ట్రెస్ లెవల్స్ ఎక్కవ అయిపోవడం వల్ల కారణంగా కూడా ఇలా జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా మెడ నల్లబడే అవకాశం ఉందని డాక్టర్ దీప్తి చెప్పారు.
అకాంథోసిస్ నైగ్రికన్స్ కంట్రోల్ చేయాలంటే
-ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కాంప్లెక్స్ కార్బోహైడేట్ ఫుడ్స్ తీసుకోవాలని సూచించారు. అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, జొన్న రొట్టెలు, చపాతీ వంటివి తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది. చక్కెర,మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలను తగ్గించి, పీచుపదార్థాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
-క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మెడ దగ్గర నల్లబడటం తగ్గుతుంది.
-కొంతమందిలో లైఫ్ స్టైయిల్ లో మార్పులు చేశాక కూడా తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. వారు రక్త పరీక్షల ద్వారా ఇన్సులిన్, చక్కెర స్థాయిలను నిర్ధారించి, సరైన ట్రీట్మెంట్ సూచిస్తారు.
డాక్టర్ సలహా మేరకు రెటినాయిడ్స్ లేదా లాక్టిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడటం వల్ల చర్మం పైపొర మందం తగ్గి, నలుపు రంగు కొద్దిగా మెరుగుపడవచ్చు.
అకాంథోసిస్ నైగ్రికన్స్ తీవ్రమైనదా?
అకాంథోసిస్ నైగ్రికన్స్ సాధారణంగా ప్రమాదకరం కానప్పటికీ.. ఏవైనా చర్మ మార్పులను చెక్ చేసుకోవడం ఉత్తమం. అరుదుగా, ఇది మరింత తీవ్రమైనదానికి సంకేతం కావచ్చు, పాచెస్‌కు కారణమేమిటో తెలుసుకోవడానికి మీకు కొన్ని పరీక్షలు అవసరం కావచ్చు.

అకాంథోసిస్ నైగ్రికన్స్ తగ్గడానికి ఎంత సమయం పడుతుంది?
అకాంథోసిస్ నైగ్రికన్స్ నుండి కోలుకోవడానికి పట్టే సమయం ఈ పరిస్థితికి కారణాన్ని బట్టి ఉంటుంది. చర్మం రంగు మారడం సాధారణంగా 1 నుండి 2 వారాలలో తగ్గిపోతుంది.
డయాబెటిస్ సంకేతమా?
మెడపై నలుపు అనేది మధుమేహానికి ఒక ముందస్తు హెచ్చరిక కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. మెడ, సంకల్లో నలుపును సౌందర్య సమస్యగా కాకుండా ఆరోగ్య సమస్యకు హెచ్చరికగా గుర్తించాలి. దానిని నిర్లక్ష్యం చేయకుండా, సరైన జీవనశైలిని అలవర్చుకుని, డాక్టర్ సలహా పాటిస్తే ఈ సమస్యను అధిగమించడమే కాకుండా, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications