Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.?
ఉరుకులుపరుగుల జీవితం, ఆలస్యంగా పెళ్లిళ్లు, ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగా దంపతుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రధానంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై చర్చలకు దారితీస్తున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వంధ్యత్వం పెరుగుతోందని వెద్యనిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలేంటి చూద్దాం..

టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్న జీవనశైలి, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఆర్థికపరమైన అంశాల కారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఇలా వివిధ కారణాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై చర్చకు దారితీసింది. పురుషుల్లో ఫెర్టిలిటీ కెపాసిటీ అనేది వీర్య కణాల సంఖ్య, నాణ్యత, మొటిలిటీ, డీఎన్‌ఏ క్వాలిటీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఇందులో లోపం తలెత్తినా అది భార్యలో గర్భధారణ అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.
వయసు ప్రభావం
కొన్నేళ్ల క్రితం వరకు పురుషులు వృద్ధాప్యంలోనూ పిల్లలను కనేవారు. వారిలో వయసు పైబడినా సంతానోత్పత్తి సామర్థ్యం పటిష్ఠంగా ఉండేది. కారణం వారు తీసుకునే శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి. కానీ ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారాయి. ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం, కూర్చుని పనిచేయడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, బయట ఫుడ్‌కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి వారిలో చిన్న వయసులోనే సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పురుషులు తమ వంధ్యత్వ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సూచిస్తున్నారు.
పురుషుల్లో వంధ్యత్వం అందరికీ ఒకేలా ఉండదు
సాధారణంగా పురుషులు తమ జీవితాంతం వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, నాణ్యత లేమి, చలనశీలత తగ్గడం, DNA నాణ్యత వంటివి ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలింతంగా కొన్ని సందర్భాల్లో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ప్రతి పురుషుడిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవద్దని నిపుణులు అంటున్నారు. వారి జీవనశైలి ప్రభావం దీనిపైన ఉంటుందని చెబుతున్నారు. కొంతమంది పురుషులు 50 ఏళ్ల వయసు దాటినా తండ్రయిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.

ఆరోగ్యకరమైన జీవనశైలి
లేటు వయసులో పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నవారు తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడం కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంతో పాటు, పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన బరువు ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఉత్తేజంగా ఉండగలరు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ అలవాట్లలో మార్పులు వీర్య కణాల నాణ్యతను ప్రభావితం చేస్తాయని గమనించాలి.
రోజూ సరైన సమయంలో తగినంత నిద్ర అవసరం. దీని ద్వారా ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోండి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఉత్తమం. ఈ క్రమంలో మీరు ఏమైనా మానసికంగా ఆందోళనలు ఎదుర్కొంటున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు..
పెళ్లయి చాలా కాలమైనా గర్భం దాల్చలేకపోయిన సందర్భాలు, లైంగిక కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు, త్వరగా స్ఖలనం అవ్వడం, హార్మోన్ల అసమతుల్యత, వృషణాల్లో నొప్పి, వాపు, గడ్డ వంటివి కనిపించినా ఆ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో చికిత్స, సరైన జీవనశైలి ద్వారా వయసు పెరుగుతున్నా సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగువుతుందని నిపుణులు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
