Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం!
ఉదయం నిద్రలేవగానే నీరసం.. పనిలో ఏకాగ్రత లోపించడం.. ఎంత విశ్రాంతి తీసుకున్నా తీరని అలసట. ఇవన్నీ నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో సాధారణమైపోయాయి. పని ఒత్తిడి, నిద్రలేమి వల్లే ఇలా జరుగుతోందని సరిపెట్టుకుని, ఓ కప్పు కాఫీ తాగి మళ్లీ పరుగు తీస్తుంటాం. కానీ మీకనిపించే ఈ నిరంతర అలసట వెనుక ఓ పెద్ద ఆరోగ్య సమస్య దాగి ఉండొచ్చని మీకు తెలుసా?
యూకేకి చెందిన ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సెర్మెడ్ మెజెర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపిన ప్రకారం.. స్పష్టమైన కారణం లేకుండా ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తే అది థయామిన్(విటమిన్ B1) లోపానికి సంకేతం కావచ్చు.

ఈ లోపాన్ని ఎందుకు గుర్తించలేరు?
సాధారణ వైద్య పరీక్షల్లో విటమిన్ B1 లోపాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. డాక్టర్ మెజెర్ మాటల్లో చెప్పాలంటే..సాధారణ క్లినికల్ ప్రాక్టీస్ లో థయామిన్ స్థాయిలను దాదాపుగా ఎప్పుడూ పరీక్షించరు. దీని లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి.
అలసట, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలేమి వంటివి దీని ప్రారంభ లక్షణాలు. ఇవన్నీ చూసి వయసు పైబడటం వల్లో, ఆఫీసు ఒత్తిడి వల్లో ఇలా జరుగుతోందని రోగులతో పాటు, డాక్టర్లు కూడా పొరబడే అవకాశం ఉంది.
దీనికి తోడుమన శరీరం థయామిన్ ను కేవలం 20 నుంచి 30 రోజుల పాటు మాత్రమే నిల్వ చేసుకోగలదు. అంటే మనం తీసుకునే ఆహారంలో కొద్దిరోజుల పాటు లోపం ఉన్నా అది శరీరంలో విటమిన్ B1 లెవల్స్ ను అమాంతం పడిపోయేలా చేస్తుంది.
విటమిన్ B1ని హరిస్తున్న ఆధునిక అలవాట్లు
మన ఆధునిక ఆహారపు అలవాట్లే ఈ విటమిన్ ను మనకు దూరం చేస్తున్నాయి. మనం రోజూ తినే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (మైదా, బేకరీ ఫుడ్స్), ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి థయామిన్ అవసరం మరింత పెరుగుతుంది.
మనం తిన్న ఆహారాన్ని శక్తిగా (గ్లూకోజ్) మార్చడంలో ఈ విటమిన్ దే కీలక పాత్ర. ఇవి కాకుండా రక్తపోటు (బీపీ) కోసం వాడే కొన్ని మందులు కూడా శరీరంలోని థయామిన్ ను మూత్రం ద్వారా త్వరగా బయటకు పంపేస్తాయి.
నిర్లక్ష్యం చేయకూడని ప్రారంభ లక్షణాలు
-ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం.
-ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం (మెంటల్ ఫాగ్).
-చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, మూడ్ స్వింగ్స్.
-మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి మందగించడం.
పరిస్థితి విషమిస్తే ఏమవుతుంది?
ఈ విటమిన్ లోపాన్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే నాడీ వ్యవస్థ, గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది బెరిబెరి అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల కండరాలు క్షీణించడం, నరాలు దెబ్బతినడం, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు రావడం, చివరకు గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.
పరిష్కారం చాలా సులభం
సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఈ సమస్యను గుర్తించిన వెంటనే సులభంగా పరిష్కరించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార మార్పులు లేదా డాక్టర్ల సలహాతో నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్ల ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా వృద్ధులు, సరైన పోషకాహారం తీసుకోని వారు, ఆల్కహాల్ కు బానిసైన వారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరమైతే వీరికి లిపిడ్ ఆధారిత థయామిన్ సప్లిమెంట్లను డాక్టర్లు సూచిస్తారు.
ఒకసారి శరీరంలో థయామిన్ లెవల్స్ సాధారణ స్థితికి చేరుకోగానే, మనం తీసుకున్న ఆహారం కణాలకు తక్షణ శక్తిని అందిస్తుంది అని డాక్టర్ మెజెర్ వివరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా విపరీతమైన అలసటతో బాధపడుతున్న వారు సైతం, థయామిన్ లెవల్స్ మెరుగుపడిన కొద్ది వారాల్లోనే ఎంతో ఉత్సాహంగా, చురుకుగా మారడాన్ని గమనించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
