Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
ఫూల్ మఖానాలో మస్తు మస్తు పోషకాలు, మంచిగా తిన్నారంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
లోటస్ సీడ్స్, పూల్ మఖానా.. ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన అల్పాహారం. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలోనే వీటిని అధికంగా తింటారు. వీటిని ఎలా వండుకొని తిన్నా రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే వండిన తినడం కంటే కూడా పచ్చివి తింటేనే మస్తు మస్తు పోషకాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఫూల్ మఖానా తింటే మంచిదని వివరిస్తున్నారు.

గ్లాసెడు పాలు తాగి ఫూల్ మఖానా తిన్నారంటే మస్తు నిద్ర:
ఆందోళన, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యల వల్ల చాలా మందికి నిద్రకు దూరం అవుతున్నారు. అలాంటి వాళ్లకు మధ్యలో ఒక్కసారి కూడా మెలుకువ రాకుండా బాగా నిద్రపోవాలంటే రాత్రిపూట గ్లాసెడు పాలు తాగి ఆ తర్వాత ఈ ఫూల్ మఖానా తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు గనుక నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్లు అయితే ఈ చిట్కాను కచ్చితంగా పాటించి చూడండి. మంచి ఫలితాలు వస్తాయి.
గర్భిణులు, బాలింతలకు మరింత మంచిది:
లోటస్ సీడ్స్ తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి పెద్ద రోగాలు దరిచేరవట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయని.. కేలరీలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే సోడియం కూడా తక్కువగా ఉంటుందట. కాబట్టి రక్తపోటు ఉన్నవారు కూడా దీన్ని తినవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరటి పండు తిన్నంత బలం వస్తుంది. గర్భిణులు, బాలింతలకు ఫూల్ మఖానా మరింత మేలు చేస్తుంది. రక్తహీనత రాకుండా చేయడం, వచ్చిన వారిలో తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
నూనెలో వేయించడానికి బదులు పెనం మీద వేయించుకోండి:
యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైన గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మంచిగా మెరిపిస్తాయి. అయితే వీటిని నూనెలో వేయించకుండా నేరుగా పెనం మీద వేయించుకొని తినాలి. పచ్చివి తింటే మరింత మంచిది. వీటిని తింటే ఆకలి పెరుగుతుంది. అలాగని బరువు పెరుగుతారని అస్సలే అనుకోవద్దు. ఆకలి వేసినా బరువు తగ్గించడంలోనూ ఫూల్ మఖానా ముందే ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.
ఈ తామర గింజలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి:
ఇందులో హానికారక శాచురేటెడ్ కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు రావు. మలబద్ధకం సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి కాస్త తిన్నా పొట్ట నిండిన భావన వస్తుంది. అలాగే మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. ఈ తామర గింజలను తింటే శరీరంలోని వ్యర్థాలను ఇవి బయటకు పంపిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications