Latest Updates
-
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు!
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు!
వర్షాకాలంలో ఏదైనా సరే ఘాటుగా, వేడిగా తినాలని ఉంటుంది ఎవరికైనా.. ఇక నాన్‌వెజ్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుడ్లు, చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్ ఐటమ్స్‌తో కర్రీలు, వేపుళ్లే కాదు స్నాక్స్‌ని సైతం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక చికెన్ పకోడీకి ఉన్న క్రేజ్ అయితే వేరే లెవెల్. ఇందులో కాసింత కాజు కలిపి చేస్తే ఆ టేస్ట్ ఎవర్ గ్రీన్.. ఈవెనింగ్ స్నాక్స్‌కి కాజు చికెన్ పకోడీ ట్రై చేయండి.. ఘాటుగా, క్రిస్పీగా భలేగా ఉంటాయి.

కాజు చికెన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్- అర కేజీ
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
గరం మసాలా- ఒక టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్- మూడు టీస్పూన్లు
మైదా పిండి- టీస్పూన్
శనగపిండి- రెండు టీస్పూన్లు
నిమ్మకాయ- సగం ముక్క
కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్-
టీస్పూన్
జీడిపప్పు- గుప్పెడు
కాజు చికెన్ పకోడీలో గార్నిష్ కోసం
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.!
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
పచ్చిమిర్చి- ఆరు
కరివేపాకు- రెండు రెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
కాజు చికెన్ పకోడీ తయారీ విధానం
ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మొత్తం కలిసే కలుపుకోవాలి.
చికెన్‌కి మసాలాలు అన్నీ పట్టించిన తర్వాత ఇందులో కార్న్‌ఫ్లోర్, శనగపిండి, మైదా పిండి, నిమ్మకాయ రసం, గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టుకుని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత స్టఫ్డ్ చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో వేసి పెట్టుకోవాలి.
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.!
అదే నూనెలో పొడవుగా, చీలికలుగా చేసిన పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని చికెన్ పకోడీలలో కొత్తిమీరతో పాటు వేసి గార్నిష్ చేసుకోవడమే.
స్సైసీగా, క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే కాజు చికెన్ పకోడీ రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎగబడి తింటారు. ఎన్ని తిన్నా తృప్తి తీరదంటే నమ్మండి..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications