Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
గుండెపోటు వచ్చిన తర్వాత స్టెంట్ అమర్చడం అనేది వైద్య చికిత్సలో భాగం. అయితే స్టెంట్ వేసిన తర్వాత మరోసారి హార్ట్ స్ట్రోక్ రాదని చాలా మంది భావిస్తుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే అది జనాల్లో అపోహగా మారింది. కానీ అది నిజం కాదని.. స్టెంట్ వేసిన తర్వాత చేసే కూడా గుండె పోటు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనరీ ధమనుల్లో తీవ్రమైన అడ్డంకులు ఏర్పడి శరీరంలో రక్త ప్రసరణకి ఆటంకం ఏర్పడినప్పుడు గుండెపోటుకి గురవుతారు. ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపెద్దా సడెన్ హార్ట్‌స్ట్రోక్‌కి గురవుతున్నారు. కొందరు అక్కడే కుప్పకూలిపోతున్నారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. ఒకసారి గుండె సంబంధిత వ్యాధులు తలెత్తాయంటే మరోసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
స్టెంట్‌తో పరిష్కారం సాధ్యమేనా.?
కాగా, గుండెపోటుకి గురైన వారిలో రక్త ప్రసరణని సాధారణ స్థితికి తీసుకురావడానికి స్టెంట్ అమరుస్తారు. అయితే ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మున్ముందు హార్ట్ స్ట్రోక్ ప్రమాదం తొలగిపోతుందని కొందరు భావిస్తూంటారు.. అది అపోహ మాత్రమే.. మూసుకోయిన ధమనులను తెరవడానికి స్టెంట్ చికిత్స ఉపయోగపడుతుంది. కానీ అది సమస్యను మాలాల నుంచి తొలగించదు.
ఈ నిర్లక్ష్యాలే కారణం
హార్ట్ స్ట్రోక్‌కి గురైన వారు స్టెంట్ వేసిన తర్వాత.. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే అది తీరని నష్టాన్ని కలిగిస్తుంది. సరైన సమయానికి మందులు వేసుకోకపోయినా, ధూమపానం అలవాట్లని మానకపోయినా, డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో లేకపోతే గుండెకి సంబంధించి ఇతర భాగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం, సరైన సమతుల్య ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఇతర ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి మరో గుండెపోటు రావడానికి దారితీస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్టెంట్ తర్వాత ఆరోగ్యకరంగా ఉంటూ మరో గుండెపోటు రాకుండా కాపాడుకునేందుకు బాధితులు మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం. రక్తపోటు, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా వైద్య పర్యవేక్షణ ఉండాలి. డాక్టర్ సూచన మేరకు రక్తాన్ని పలచబరిచే మందులు, ఇతర సంబంధింత మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. శారీరక శ్రమలో పాల్గొంటూ బరువును వీలైనంతగా అదుపులో ఉంచుకోవాలి.
అయితే స్టెంట్ అమర్చిన తర్వాత కూడా మీకు ఛాతీ నొప్పి, ఆయాసం, అధికంగా చెమట పట్టడం, భుజం, ఎడమ చేతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, లేదా వ్యాయామం తప్పనిసరి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
