Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
ఆవకాడోను ఇలా తింటేనే ప్రయోజనం..కట్ చేసిన ఆవకాడోను ఇలా చేస్తే ఎక్కువ సమయం ఫ్రెష్ గా!
ఒకప్పుడు ఆవకాడో అంటే మొఖం పక్కకు తిప్పేసుకునేటోళ్లు కూడా ఈ మధ్య కాలంలో దీన్ని ఎగబడి తింటున్నారు. మార్కెట్లు,స్టోర్స్ లో ఆవకాడో పెడితే నిమిషాల్లో అవి అమ్ముడవుతున్నాయి అంటే జనం వీటిని ఎంతగా తినేందుకు ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆవకాడో పట్ల జనాల్లో ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అది అందించే ప్రయోజనాల గురించి అవగాహన రావడమే. ఆవకాడలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక అంశాలు ఉంటాయి. విపరీతమైన పోషకాలు, పెద్ద మొత్తంలో ఆరోగ్యకమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక ఇతరమైనవి ఆవకాడోలో ఉంటాయి. ఆవకాడో తినడం వల్ల ముఖ్యంగా గుండెకు చాలా మేలు జరుగుతుంది.
ఆవకాడో ఆరోగ్యానికి అమృతమే అయినప్పటికీ దీనిని రోజూ కొద్దిగానే తినాలి. ఎక్కువగా తింటే అమృతమయినా ఆవకాడో అయినా విషంగానే మారుతుంది కాబట్టి పరిమితంగా తినాలి. ప్రతి రోజూ ఆవకాడో కాయలో సగ భాగం తింటే సరిపోతుందని చాలామంది నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే ఆవకాడో కాయను ఇంట్లో సరిగ్గా నిల్వ చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. దీన్ని గనుక సరిగ్గా నిల్వ చేసుకుంటే వెంటనే పాడైపోతుంది. అయితే కట్ చేసిన ఆవకాడోని పాడవుకుండా ఫ్రెష్ గా ఉండేలా ఇంట్లో ఎలా నిల్వ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కట్ చేసిన ఆవకాడోని పాడవకుండా ఫ్రెష్ గా ఉంచుకునే టిప్స్
-సగం వాడిన అవకాడోను గోధుమ రంగులోకి మారకుండా కాపాడుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. అదేంటంటే.. అవకాడోలో సగం మాత్రమే వాడుతున్నట్లయితే గింజను తీయకుండా అలాగే ఉంచండి. అవకాడో గింజ..గుజ్జుకు గాలి తగలకుండా ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. దీనివల్ల ఆక్సీకరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. గింజ ఉండటం వల్ల గాలికి గురయ్యే అవకాడో గుజ్జు ఉపరితలం తగ్గుతుంది. ఫలితంగా, మీ అవకాడో ఎక్కువ సమయం పాటు ఫ్రెష్ గా, పచ్చగా ఉంటుంది.
-సగం వాడిన అవకాడో నల్లబడకుండా ఉండాలంటే..మిగిలిన అవకాడో గుజ్జుకు నేరుగా ప్లాస్టిక్ కవర్ తో కప్పేయండి. అవకాడో గుజ్జుకు, గాలికి మధ్య ఒక రక్షిత పొరలా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుం. గాలి తగలకపోవడం వల్ల అవకాడో గుజ్జు రంగు మారకుండా, దాని సహజమైన ఆకృతిని, నిగారింపును ఎక్కువ సమయం నిలుపుకుంటుంది.
-కట్ చేసిన అవకాడోను ఫ్రిజ్ లో నిల్వ చేయండి. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు ఆవకాడో నల్లబడే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. సరిగ్గా నిల్వ చేస్త, కట్ చేసిన అవకాడో 1-2 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
-నిమ్మ లేదా నిమ్మకాయ రసం చిట్కాలో కట్ చేసిన ఆవకాడో నల్లగా అవకుండా కాపాడవచ్చు. ఇందుకోసం కట్ చేసిన అవకాడో ఉపరితలంపై కొద్దిగా నిమ్మ లేదా నిమ్మకాయ రసాన్ని తేలికగా రాయండి.నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్..అవకాడో నల్లబడటానికి కారణమయ్యే రసాయన చర్యను నిరోధిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ అవకాడో గుజ్జు దాని సహజమైన ఆకుపచ్చ రంగును కోల్పోకుండా, రుచిని కూడా ఎక్కువ కాలం పాటు నిలుపుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
