Latest Updates
-
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.!
సరైన పోషణ, సంరక్షణ లేకపోతే జుట్టు చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. దీని వల్ల జుట్టు అందవిహీనంగా కనిపించడమే కాదు.. కురుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అసలు ఎందుకు ఇలా అవుతుంది.. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి. జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఎలా కాపాడుకోవాలనేదానికి బ్యూటీషియన్ నిపుణులు కొన్ని కారణాలు, సలహాలు ఇస్తున్నారు.

అతివల అందాన్ని మరింతగా పెంచేది కురులు. అయితే దుమ్ము, ధూళి, షాంపూలు, కండిషనర్స్, స్టైలింగ్స్ ఇలా ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనపడటం, చివర్లు చిట్లిపోవడం, రంగు మారి ఆకర్షణ కోల్పోవడం, ఊడిపోవడం, జిడ్డుగా మారడం ఇలా చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జుట్లు చివర్లు చిట్లిపోవడం కురులను అందవిహీనంగా మార్చుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
ముఖ్యంగా జుట్టును ఎక్కువగా స్టైలింగ్ చేసినప్పుడు లేదా సరైన షాంపూలు వాడకపోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పై భాగంలో ఉండే క్యూటికల్ ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. కురులు దెబ్బతిన్నప్పుడు ఈ పొర ఊడిపోయి చివర్లు చిట్లిపోతాయి. అంతేకాకుండా జుట్టు తేమను కోల్పోయినా ఇలా చిట్లిపోయి పొడిగా మారుతుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.
హెయిర్ స్టైలింగ్‌లో భాగంగా హీట్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే అధిక వేడి క్యూటికల్‌ను దెబ్బతీస్తుంది. అందుకే ముందుగా హీట్ ప్రొటెక్షన్ సీరమ్ అప్లై చేసిన తర్వాత జుట్టును స్టైలింగ్ చేసుకోవాలి. జుట్టు బలహీనంగా ఉన్నవారు తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్టైల్ చేసుకోవడం ఉత్తమం. కూలింగ్ బ్లో-డ్రైయర్‌ను ఉపయోగించినట్లయితే మీ జుట్టును వేడి నుంచి కాపాడుతుంది. బయటకు వెళ్లిన సందర్భాల్లో ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు జుట్టును స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవాలి.

తలస్నానం చేసేటప్పుడు రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు వాడకండి. కురులను నల్లగా లేదా ఎర్రగా మార్చేందుకు పదే పదే రంగు వేయడం కూడా మంచిది కాదు. దీని వల్ల జుట్టు ఊడిపోవడంతో తీవ్రమైన నష్టం కలుగుతుంది. చవక ఉత్పత్తులను జుట్టుకు ఉపయోగించడం కూడా మంచిది కాదు.
అధిక సల్ఫేట్ ఉన్న షాంపూలు జుట్టుకి వాడటం మంచిది కాదు. ఇవి నురుగు ఎక్కువగా రావడం ద్వారా మీ తల చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇక వారంలో తరచూ ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో జుట్టు చివర్లు చిట్లిపోతాయి. ఇందుకోసం తక్కువ షాంపూ వాడాలి. తక్కువ సల్ఫేట్ ఉన్న షాంపూలను వాడటం ఉత్తమం. ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్న షాంపూలు వాడటం కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు.
కుంకుడు కాయల రసంతో తల స్నానం చేయడం ద్వారా జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆ అవకాశం లేని వారు సరైన షాంపూలు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అధిక వేడికి దూరంగా ఉండటం, పదే పదే తలస్నానం చేయడం, అధిక గాఢత ఉన్న హెయిర్ కలర్స్ వాడటం వంటి వాటికి దూరంగా ఉంటూ ఇంట్లోనే సహజంగా లభించే పదార్థాలతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
