Latest Updates
-
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
వెస్టర్న్ టాయిలెట్‌పై కూర్చుంటున్నారా? ఈ వ్యాధులు రావొచ్చు జాగ్రత్త!
టాయిలెట్ సీటుపై.. మురికికుంప ఉన్నన్ని క్రిమి కీటకాలు ఉంటాయంటున్నారు వైద్యులు. టాయిలెట్ సీట్లపై బ్యాక్టీరియా, ఇన్ఫ్లూయెంజా, స్ట్రెప్టోకోకస్, ఇకోలి, హెపటైటిస్, స్టెఫిలోకాకస్, సాల్మొనెల్లా, షిగెల్లా, నోరోవైరస్ లాంటి హానికర బ్యాక్టీరియా, వైరస్ లు ఉంటాయి. టాయిలెట్ సీటుపై ప్రతి చదరపు అంగుళం మీద 50 కంటే ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ లు ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీని క్రిమికీటకాల వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్స్ తో పోలిస్తే వెస్టర్న్ టాయిలెట్ల వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్ సీటును ఆనుకుని తినడం వల్ల మరింత ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్ లను నేరుగా తాకే అవకాశాలు ఉంటాయి. టాయిలెట్ సీటుపై ఉండే క్రిమికీటకాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే..

ఎస్టీడీలు
లైంగికంగా సంక్రమించే వ్యాధులు టాయిలెట్ సీటు వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంట్లోని టాయిలెట్లు వాడినా ఇది రావొచ్చని అంటున్నారు.
బ్యాక్టీరియల్ వజీనా
వజీనాలో బ్యాక్టీరియా అధికంగా చేరడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల యోని ఆరోగ్యం పాడవుతుంది. దుర్వాసన వస్తుంది. దురద, చికాకు ఉంటుంది. మంట పుడుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. యూటీఐ వ్యాధులు మూత్రాశయం, మూత్రనాళం, కొన్నిసార్లు మూత్రపిండాలకు కూడా సోకుతుంది.
ప్రొస్టాటిటిస్
ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రొస్టాటిటిస్ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిన పురుషుల్లో ప్రొస్టేట్ ఉబ్బుతుంది. ఈ ఇన్ఫెక్షన్ జననేంద్రియాలు, గజ్జల ప్రాంతంలో ఏర్పడుతుంది. నొప్పితో కూడిన బాధ ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
