Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
బొడ్డు చుట్టూ నెయ్యి రాస్తే ఏమవుతుందో తెలుసా..
నెయ్యి వల్ల లభించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ నెయ్యిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చాలామంది ఆయిల్ కి వంటలకు కూడా నెయ్యినే ఉపయోగిస్తుంటారు. అయితే ఇది కొంచెం ఖరీదైనది కావడంతో చాలా తక్కువమంది మాత్రమే దీనిని వంటల్లో ఉపయోగిస్తుంటారు. నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఈ,ఏ,డీ,కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
ఇక మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం బొడ్డు.ఇది మన శరీరాన్ని ఒకే చోట కలిపి ఉంచే కేంద్రం. అలాంటి బొడ్డు చుట్టూ నెయ్యితో మసాజ్ చేస్తే బోలెడు ప్రయోజనాలుంటాయంట. బొడ్డు చుట్టూ నెయ్యి రాయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుసిపోతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బొడ్డు చుట్టూ నెయ్యి రాసే సంప్రదాయం ఆయుర్వేదంలో ప్రస్తావించబడింది. బొడ్డు చుట్టూ నెయ్యితో మసాజ్ చేయడం ఒక రకమైన థెరపీగా పరిగణించబడుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది,ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో బొడ్డు చుట్టూ నెయ్యి రాసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.

ఎలా చేయాలి
రాత్రి పడుకోవడానికి ముందు బొడ్డు చుట్టూ కొద్దిగా నెయ్యి రాసి మెల్లగా మర్దన చేయండి. నెయ్యిని రాసిన తర్వాత ఒక వెచ్చని గుడ్డతో బొడ్డును కప్పండి. నెయ్యిని బొడ్డు చుట్టూ రాసే ముందు మీకు ఏదైనా అలర్ ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం బెస్ట్. బొడ్డు చుట్టూ నెయ్యి రాసే సంప్రదాయం ఆయుర్వేదంలో ప్రస్తావించబడినప్పటికీ దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతిని అనుసరించే ముందు సంబంధిత వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications