Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
ఈ నల్ల పండు ఎక్కడ కనిపించినా వదలొద్దు..చలికాలంలో తప్పక తినాల్సిన ఫ్రూట్ ఇది
మనం బజారుకో లేదా మార్కెట్ కి వెళ్లినప్పుడు అక్కడ నల్లగా దుంపల్ని అమ్మడం గమనించి ఉంటాం. బయట నల్లగా లోపల తెల్లగా ఉండే వీటిని చూస్తుంటాం కానీ అవేంటో తెలియక వాటిజోలికి పోరు చాలామంది. అయితే ఈసారి మాత్రం ఎక్కడైనా ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే వీటి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చలికాలంలో ఇవి అందించే ప్రయోజనాలు బోలెడు ఉంటాయి.
నల్లగా ఉండే ఈ దుంపలని సింగాడా అని పిలుస్తారు. ఇంట్లీష్ లో వీటిని వాటర్ చెస్ట్ నట్ అంటారు. వీటి రుచి కొంచెం వగరుగానే ఉంటుంది. సింగాడాలు నీటిలో దొరికే దుంపలు. ప్రెష్ గా ఉన్నప్పుడు ఇవి పచ్చగా,ఎర్రగా ఉంటాయి. వీటి షేపు కారణంగా వీటిని బ్యాట్ నట్, బుల్ నట్ అని కూడా అంటారు. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ దుంపల్ని మర పట్టించి ఆ పిండితో అనేక వంటకాలు కూడా చేస్తుంటారు. వీటి రుచి కొంచెం వగరుగానే ఉంటుంది. వీటిని పచ్చిగా కూడా తింటారు. అయితే ఉడికించినవి రుచిగా ఉంటాయి. మనం మార్కెట్లో లేదా తోపుడు బండ్లమీద చూసేవి ఉడికించిన నల్లని సింగాడాలు.

సింగడాలతో లభించే ఆరోగ్య ప్రయోజనాలివే
-సింగాడాల్లో విటమిన్ సి, ఫైబర్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, పీచు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకొనే వారికి ఇది మంచి ఆహారం.
-సింగాడాల్లోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చలికాలంలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది.
-సింగాడాల్లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
-సింగాడాలకు సంతాన సామర్థ్యాన్ని పెంచే శక్తి ఉందని చెబుతారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
-సింగాడాల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
-యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం కాబట్టి వీటితో చేసిన రొట్టెలని ఉపవాసాలప్పుడు తింటే శక్తిని పుంజుకుంటారని నిపుణులు చెబుతారు.
-సింగాడాల్లో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్దకం రాకుండా చేస్తుంది.
-సింగడాల్లో పొటాషియం ఎక్కువగా ఉండి శరీరంలో సోడియం లెవల్స్ ని కంట్రోల్ చేసి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
-అధిక రక్తపోటుతో బాధపడేవాళ్లు సింగడాలను ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది.
సింగడాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇవి చాలా మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
