Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టిస్తే..10 నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా!
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ మన శరీరం అనేక రకాల మార్పులకు గురవుతుంది. ఈ మార్పులలో జుట్టు రంగు మారడం లేదా జుట్టు రాలడం వంటివి కూడా ఉంటుంటాయి. యాభై ఏళ్ల తర్వాత జుట్టు రాలడం,జుట్టు నెరవడం చాలా సాధారణం. అయితే ప్రస్తుతం ప్రజల జీవనశైలిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండటంతో కొంతమందికి చాలా చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో బయట నలుగురిలోకి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. జుట్టు తెల్లబడటానికి శరీరంలో విటమిన్ల లోపం సహా అనేక ఇతర కారణాలు ఉండవచ్చు.
ఒక్కసారి జుట్టు తెల్లబడితే చాలామంది హెయిర్ డై కోసం వెళ్తున్నారు. వెంటుక్రలు తెల్లబడిన చోట తరచుగా రంగు వేసుకుంటుంటారు. అయితే ఇలా రంగు వేసుకోవడం వల్ల చాలా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తున్నారా? మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్ వాడకుండానే తెల్లగా మారిన మీ జుట్టుని నల్లగా మార్చుకోవడం ఎలా అనుకుంటున్నారా? సింపుల్ గా మునగాకు పొడితో ఈ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మునగకాయ మాత్రమే కాదు దాని ఆకులు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. మునుగ ఆకులు ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. మునగ ఆకుల్లోని పోషకాలు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో కూడా బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మునగ ఆకులలో జింక్, విటమిన్ ఏ, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి.
ఇలా రెడీ చేసుకోండి
మునగ ఆకు పొడితో హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా మునగ ఆకును ఎండబెట్టాలి. ఎండిన ఆకులను బాగా రుబ్బుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఇలా అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య దరిచేరదు.
Note: ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి దీనిని పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
