Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
మనం రోజూ వాడే సబ్బులు డేంజరా? ఏ సబ్బు వాడితే ఆరోగ్యానికి,చర్మానికి మంచిదంటే..
రోజూ మనం మన దినచర్యను స్నానంతో ప్రారంభిస్తాం. ఆ సమయంలో మన శరీరానికి తోడుగా ఉండేది సబ్బు. కేవలం మురికిని, చెమటను వదిలించుకోవడానికే కాకుండా చర్మానికి పోషణ అందించి, తాజాగా ఉంచడంలో సబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మార్కెట్ లో అందుబాటులో ఉండే రంగురంగుల, సువాసనభరితమైన సబ్బుల మధ్య మన చర్మానికి ఏది మంచిదో ఎలా తెలుసుకోవాలి? మనం వాడే సబ్బుల్లో ఎలాంటి పదార్థాలు ఉంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
సబ్బు అనేది కేవలం శుభ్రపరిచే సాధనం కాదు అది మన చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. మనుషులు సబ్బుల వాడకం 4వేల సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి సబ్బులు మనల్ని శుభ్రం చేస్తున్నాయి. క్రీస్తుపూర్వం 2800 సంవత్సరంలో బాబాలోనియన్లు జంతుకొవ్వు,చెక్క బూడిదతో సబ్బును తయారుచేశారు. అయితే ఈ సబ్బును ఎక్కువగా బట్టలు ఉతకడానికి ఉపయోగించారు.క్రీస్తుపూర్వం 1500 నాటికి ఈజిప్టియన్స్ నూనెలు,లవణాలతో సబ్బును చర్మ సంరక్షణ కోసం మెరుగుపర్చారు. ఆ తర్వాత యూరోపియన్స్ స్నానానికి అనుకూలంగా ఆలివ్ ఆయిల్ తో సుగంధ సబ్బులు కూడా తయారుచేశారు.

అయితే ప్రస్తుతం మన వాడే చాలా సబ్బుల్లో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయి. సబ్బుల్లో ఉండే సోడియం లారెల్ సల్ఫేట్.. చర్మం మీద ఉండే సహజ నూనెలను తీసేసి పొడి బారడం,చికాకును కలిగిస్తాయి. సబ్బుల్లో ఉండే పారాబేన్స్,థైలాయిడ్స్ అనే రసాయనాలు..హార్మోన్స్ ను గందరగోళం చేసి ఆరోగ్య సమస్యలను తెస్తాయి.సబ్బుల్లో ఉండే ట్రైక్లసాన్ అనే ఇంకో రసాయనం బ్యాక్టీరియాలను చంపేస్తుంది కానీ హార్మోన్ బ్యాలెన్స్ తో పాటు పర్యావరణానికి కూడా హానిచేస్తుంది. కాబట్టి ముందుగా మీ సబ్బుల్లో ఏముందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీ చర్మం,ఆరోగ్యాన్ని,హార్మోన్స్ ను కాపాడుకోవచ్చు.
మనం వాడే సబ్బులో ఏ పదార్థాలు ఉంటే మంచిది
-కొబ్బరి నూనె, షియా బట్టరు, అలోవేరా,తేనె వంటి సహజపదార్థాలతో తయారైన సబ్బులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చర్మానికి,ఆరోగ్యానికి హాని చేయకుండా శుభ్రం చేస్తాయిని నిపుణులు చెబుతున్నారు.
-గ్లిజరిన్ ఒక అద్భుతమైన పదార్థం. ఇది గాలిలోని తేమను గ్రహించి చర్మానికి అందిస్తుంది. దీనివల్ల చర్మం రోజంతా తాజాగా, హైడ్రేట్ గా ఉంటుంది. చాలా వాణిజ్య సబ్బుల తయారీ ప్రక్రియలో గ్లిజరిన్ ను వేరు చేస్తారు. కానీ, సహజసిద్ధమైన లేదా చేతితో తయారుచేసిన (Handmade) సబ్బులలో గ్లిజరిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీ సబ్బులో గ్లిజరిన్ ఉందో లేదో తప్పకుండా గమనించండి.
-సున్నితమైన చర్మం ఉన్నవారికి ఓట్ మీల్ తో కూడిన సబ్బులు చాలా మంచివి. ఇది మృతకణాలను సున్నితంగా తొలగించి, చర్మానికి ఉపశమనాన్ని ఇస్తుంది.
-ఈసారి సబ్బు కొనేటప్పుడు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ లేదా వాసనను చూసి మోసపోకండి. సహజ పదార్థాలు ఉన్న సబ్బును ఎంచుకోండి. సల్ఫేట్లు (Sulphates), పారాబెన్లు (Parabens) వంటి కఠినమైన రసాయనాలకు దూరంగా ఉండండి. మన చర్మ రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. సురక్షితమైన చర్మ సంరక్షణ కోసం విశ్వసనీయ వైద్య సలహాలను కూడా తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications