Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్!
సాధారణంగా అందరి వంటగదుల్లో వెల్లుల్లి తప్పక ఉంటుంది. వంటకాలకు రుచి, సువాసన కోసం వెల్లుల్లిని వాడుతుంటారు. మనందరికీ తెలిసిన వెల్లుల్లి తెలుపు రంగులోనే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా నల్ల వెల్లుల్లి గురించి విన్నారా?
ఇది చూడటానికి రంగులో సాధారణ వెల్లుల్లికి భిన్నంగా ఉన్నప్పటికీ, ఇది వేరే మొక్క నుండి పుట్టుకొచ్చింది కాదు. మన ఇంట్లో ఉండే తెల్ల వెల్లుల్లికి జరిగిన ఒక అద్భుతమైన రూపాంతరమే ఈ నల్ల వెల్లుల్లి.

ఎలా తయారు చేస్తారు?
నల్ల వెల్లుల్లిని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. సాధారణ వెల్లుల్లి రెబ్బలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, తేమ ఉన్న వాతావరణంలో కొన్ని వారాల పాటు జాగ్రత్తగా నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియను ఏజింగ్ అంటారు. ఈ సమయంలో వెల్లుల్లిలోని అమైనో ఆమ్లాలు, చక్కెరల మధ్య జరిగే రసాయన చర్యల వల్ల అది నెమ్మదిగా ముదురు నలుపు రంగులోకి మారుతుంది.
రుచి, ఆకృతి ఎలా ఉంటాయి?
పచ్చి వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా ఉంటుందని చాలామంది దాన్ని పచ్చిగా తినడానికి ఇష్టపడరు. కానీ నల్ల వెల్లుల్లి విషయానికి వస్తే ఆ సమస్యే ఉండదు. ఏజింగ్ ప్రక్రియ వల్ల దీనిలోని ఘాటైన వాసన పూర్తిగా తగ్గిపోయి, ఒక రకమైన తేలికపాటి తీపి, పులుపు రుచుల మిశ్రమంగా మారుతుంది. దీని రెబ్బలు లోపల మెత్తగా, కాస్త జిగురుగా, జెల్లీ లాగా మారి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి.
నల్ల వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల వెల్లుల్లిని కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య సంజీవనిగా కూడా చెప్పవచ్చు.
-ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వకుండా, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కణాలకు జరిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
-నల్ల వెల్లుల్లిలోని సమ్మేళనాలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది రక్తపోటును (బీపీ), చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో సానుకూల ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపారు.
నల్ల వెల్లుల్లి ఎలా తినాలి?
దీనిని ఏ రూపంలోనైనా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. నేరుగా ఉదయాన్నే తినవచ్చు లేదా సలాడ్స్, సూప్స్, కూరలు, సాస్ లు, బ్రెడ్స్ తయారీలో వాడుకోవచ్చు. వంటకాలకు ఇది ఒక వెరైటీ ఫ్లేవర్ ను ఇస్తుంది.దీన్ని మోతాదుకు మించి తింటే కడుపునొప్పి లేదా గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.
అందువల్ల మితంగా తినడం ఉత్తమం. ఒకవేళ మీరు బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లయితే మీ డైట్ లో దీన్ని చేర్చుకునే ముందు ఒకసారి మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
