Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
వాతావరణం కేవలం మీ మానసిక స్థితిని మాత్రమే కాదు, మీ బ్లడ్ షుగర్ (రక్తంలో చక్కెర) స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహం (డయాబెటిస్) ఉన్న చాలా మంది, ముఖ్యంగా వేసవి, వర్షాకాలం మరియు చలికాలం వంటి వాతావరణ మార్పుల సమయంలో తమ గ్లూకోజ్ స్థాయిలలో అంచనా వేయలేని మార్పులను గమనిస్తుంటారు. వాతావరణం నేరుగా మధుమేహానికి కారణం కాకపోయినప్పటికీ, మీ శరీరం బ్లడ్ షుగర్‌ను నియంత్రించే విధానంపై అది ప్రభావం చూపుతుంది.

జ్ఞాన్ బై గణేష్ - మేకింగ్ ఇండియా విన్ ఓవర్ డయాబెటిస్ అనేది సన్ ఫార్మా, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ భాగస్వామ్యంతో చేపట్టిన ఒక అవగాహన కార్యక్రమం. నిపుణుల సలహాల ద్వారా భారతీయులు మధుమేహాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, నివారించడానికి, అదుపులో ఉంచుకోవడానికి సహాయపడటం దీని ముఖ్య ఉద్దేశ్యం.
వాతావరణం బ్లడ్ షుగర్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఉష్ణోగ్రత మరియు వాతావరణంలోని తేమలో వచ్చే మార్పులు శరీరంలో నీటి శాతం (హైడ్రేషన్), హార్మోన్ స్థాయిలు, శారీరక శ్రమ, ఇన్సులిన్ శోషణ (శరీరం ఇన్సులిన్‌ను గ్రహించే విధానం) పై ప్రభావం చూపుతాయి.
వేసవి కాలంలో: వేడి వాతావరణంలో చెమట ద్వారా శరీరం ఎక్కువ ద్రవాలను కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరిగి, బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయి. వేడి కారణంగా చర్మం నుండి ఇన్సులిన్ గ్రహించే విధానంలో కూడా మార్పులు రావచ్చు, దీనివల్ల షుగర్ లెవల్స్‌లో ఊహించని హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
వర్షాకాలంలో: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణం. అనారోగ్యానికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి (స్ట్రెస్) హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల మీరు సాధారణ ఆహారం తీసుకుంటున్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
చలికాలంలో: చలికాలంలో చాలామంది శారీరకంగా తక్కువ చురుకుగా ఉంటారు, అంతేకాకుండా ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. వ్యాయామం తగ్గడం, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల వల్ల ఆరోగ్యకరమైన గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడం కష్టమవుతుంది.
దోహదం చేసే ఇతర అంశాలు
- ఉష్ణోగ్రతతో పాటు, వాతావరణం మారేటప్పుడు జీవనశైలిలో వచ్చే అనేక మార్పులు మధుమేహం నిర్వహణను ప్రభావితం చేస్తాయి
- తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల శారీరక శ్రమ (వ్యాయామం) తగ్గడం
- పండుగలు లేదా సెలవు దినాలలో ఆహారపు అలవాట్లు మారడం
- వేడి లేదా తేమతో కూడిన వాతావరణం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం
- ఇన్ఫెక్షన్ల సమయంలో శరీరంపై ఒత్తిడి పెరగడం
- తగినంత నీరు త్రాగకపోవడం
ఈ అంశాలన్నీ కలిసి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి లేదా తగ్గిపోవడానికి కారణమవుతాయి.

'’ వాతావరణమే నేరుగా బ్లడ్ షుగర్‌ను పెంచుతుందని చాలామంది భావిస్తారు, కానీ మారుతున్న పర్యావరణ పరిస్థితులకు శరీరం ఎలా స్పందిస్తుంది అనేదే అసలు ప్రభావాన్ని చూపుతుంది. డీహైడ్రేషన్, సీజనల్ ఇన్ఫెక్షన్లు, మారిన ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీరక శ్రమ ఇవన్నీ గ్లూకోజ్ నియంత్రణను ప్రభావితం చేస్తాయి. వాతావరణం మారే సమయంలో మధుమేహం ఉన్నవారు తరచుగా తమ బ్లడ్ షుగర్‌ని చెక్ చేసుకోవాలి, తగినంత నీరు త్రాగాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, మందులు వాడటం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. రోజువారీ అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఊహించని బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులను నివారించవచ్చు.’’
Dr. Radhakrishna Telagareddy, Consultant Endocrinologist, Radhakrishna Endocare, Rajahmundry
వాతావరణ మార్పుల టైంలో బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచుకోవడానికి చిట్కాలు
- రోజంతా తగినంత నీరు త్రాగండి.
- మీకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు బ్లడ్ షుగర్‌ను తరచుగా చెక్ చేసుకోండి.
- బయటి వాతావరణం అనుకూలించనప్పుడు ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండండి.
- బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, పండుగల సమయంలో లేదా సీజనల్ కోరికల వల్ల అతిగా తినడం మానుకోండి.
- ఇన్సులిన్, మధుమేహం మందులను సిఫార్సు చేసిన ఉష్ణోగ్రత వద్దే భద్రపరచండి.
SPI-IN-CVD-ZT---08-20260337
Disclaimer:ఈ సమాచారం కేవలం రోగులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మాత్రమే ఇవ్వబడింది. ఇది వైద్యుడు లేదా ఆరోగ్య నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL) కచ్చితమైన మరియు సకాలంలో సమాచారాన్ని అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తుంది, కానీ ఈ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వదు. మీరు మీ వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణులను మాత్రమే సంప్రదించి, వారి సలహాపై ఆధారపడాలి. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL)కు ముందుగా తెలియజేయకుండా ఈ సమాచారాన్ని యాంత్రికంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో పునరుత్పత్తి చేయడం, ప్రసారం చేయడం లేదా ఏ రూపంలోనూ నిల్వ చేయడం చేయకూడదు.



Click it and Unblock the Notifications
