Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ మొక్క కలియుగ సంజీవని..మెదడును సూపర్ ఫాస్ట్ గా చేస్తుంది,జుట్టు రాలడం ఆపేస్తుంది,నిద్రలేమికి దివ్యౌషధం
మన చుట్టూ ఉండే కొన్ని మొక్కలను కలుపు మొక్కలుగా భావించి పీకి పడేస్తుంటాం లేదా అస్సలు వాటి గురించి పట్టించుకోం. అయితే అలాంటి మొక్కల్లో కొన్ని మన ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసేవి చాలా ఉంటాయి. వాటి గురించి,అవి అందించే ప్రయోజనాల గురించి మనకు పెద్దగా తెలియకపోవడంతో ఇలా చేస్తుంటాం. ఇలాంటి ఒక అద్భుతమైన మొక్కల్లో బ్రహ్మి మొక్క ఒకటి. ఇది ఒక ఆయుర్వేద మూలిక.అనేక శక్తివంతమైన గుణాలు ఈ మొక్క ఆకుల్లో ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశాలలో కనిపిస్తుంది. దీని ఆకులు గుండ్రంగా మందంగా ఉంటాయి. ఈ ఆకులను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది మనుషులకు ఈజీగా లభించే కలియుగ సంజీవని.
ఇది చాలా ప్రయోజనకరమైన,ప్రభావవంతమైన ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంతోపాటు చైనా సంప్రదాయ వైద్యంలోనూ ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా మెదడు సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా మానసిక వికలాంగులకు ఇది చాలా ప్రయోజనకరమైనదని చెబుతుంటారు. అంతేకాకుండా చర్మం, జుట్టు సమస్యలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక వ్యాధులలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఒక మొక్క, అనేక ప్రయోజనాలు
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి బ్రాహ్మిని తీసుకుంటారు. ఇది మెదడు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికి అడాప్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో బ్రాహ్మి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు సమస్యలను తొలగిస్తుంది. దీనిని సరిగ్గా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మొక్క ఆకుల రసం మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం సాగే గుణాన్ని పొంది చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. ఎగ్జిమా వంటి చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలు వాపులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బ్రహ్మి..ర్ణక్రియ, మెరుగుదల, నిద్ర సమస్యలు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ మొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొక్క ఆకుల రసం సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి నొప్పులు, వాపులు అయినా సరే తగ్గిపోతాయి. ఈ మొక్క ఆకుల్లో అడాప్టొజెన్ గుణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో ఒత్తిడి పెరగడానికి కార్టిసాల్ అనే హార్మోన్ ముఖ్య కారణంగా ఉంటుంది. ఈ హార్మోన్ లెవల్స్ పెరగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయి. కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించడంలో బ్రాహ్మి వినియోగం చాలా సహాయపడుతుంది. శంఖపుష్పి, బాదంగిరి, యాలకులతో కలిపి బ్రాహ్మిని రుబ్బి త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎలా తినాలి
బ్రాహ్మి ఆకులని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుల పొడిని నీరు, పాలు లేదా తేనెతో కలిపి తాగుతారు. దీని నూనె జుట్టు, చర్మానికి దివ్యౌషధం. క్యాప్సూల్ రూపంలో కూడా ఉపయోగిస్తారు. మీ వయస్సు,వ్యాధిని బట్టి సరైన మోతాదును డాక్టర్ మాత్రమే చెప్పగలరు. కాబట్టి దీన్ని వాడే ముందు డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
