Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
లవ్ బైట్ ప్రాణాలు తీస్తుందా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు!
నేటి యువతలో ప్రేమను చాటుకోవడానికి, ఒకరికొకరు మరింత దగ్గరవ్వడానికి లవ్ బైట్స్ ఇచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. కానీ ఈ క్రమంలో ఏర్పడే ఒక చిన్న మచ్చ మీ ప్రాణాలకే ముప్పుగా మారుతుందని మీరెప్పుడైనా ఊహించారా? ఆశ్చర్యంగా అనిపించినా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. గతంలో లవ్ బైట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో చూశాం.

అసలు ఈ లవ్ బైట్ ఏంటి?
లవ్ బైట్ అంటే... భాగస్వామి చర్మాన్ని (ముఖ్యంగా మెడపై) పెదాలతో ఎక్కువసేపు గట్టిగా పీల్చడం లేదా కొరకడం వల్ల ఏర్పడే గుర్తు. ఇలా గట్టిగా పీల్చినప్పుడు చర్మం కింద ఉండే సున్నితమైన రక్తనాళాలు (సిరలు) చిట్లిపోతాయి. దాంతో రక్తం బయటకు రాలేక అక్కడే గడ్డకట్టి, చర్మంపై ఎరుపు లేదా ముదురు నీలం రంగు మచ్చలా మారుతుంది. సాధారణంగా ఇది ఒక చిన్నపాటి గాయం మాత్రమే. కొద్ది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఈ చిన్న గాయమే కొన్నిసార్లు మృత్యుపాశంలా మారుతుంది.
ఒక చిన్న మచ్చ ప్రాణాలు ఎలా తీస్తుంది?
లవ్ బైట్ వల్ల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం మన మెడలోని నరాల నిర్మాణం. మన మెడ భాగంలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన కెరోటిడ్ ధమనులు ఉంటాయి.
తీవ్రమైన ఒత్తిడి: మెడపై చాలా గట్టిగా, ఎక్కువసేపు చప్పరించినప్పుడు ఈ ధమనులపై విపరీతమైన ఒత్తిడి పడి రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది.
రక్తం గడ్డకట్టడం: ఆ తీవ్రమైన ఒత్తిడి వల్ల లోపలి రక్తనాళాలు చిట్లిపోయి, అక్కడ రక్తం గడ్డకడుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం): అలా గడ్డకట్టిన రక్తం, రక్త ప్రవాహం ద్వారా నేరుగా మెదడులోకి చేరుకుంటుంది. ఇది మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను పూర్తిగా అడ్డుకుంటుంది. దీనినే వైద్య పరిభాషలో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఈ స్ట్రోక్ వల్ల క్షణాల్లో పక్షవాతం రావడం లేదా ప్రాణాలు గాలిలో కలవడం జరుగుతుంది.

డాక్టర్ ను ఎప్పుడు కలవాలి?
లవ్ బైట్ మచ్చ ముదురు నలుపు రంగులో ఉండి, చుట్టూ విపరీతంగా వాస్తే అది ప్రమాదకరం. కింది లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కి వెళ్లాలి.
-విపరీతమైన తలనొప్పి, తల తిరగడం లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం.
-శరీరంలో లేదా ముఖంలో ఒక వైపు అకస్మాత్తుగా తిమ్మిరి రావడం, బలహీనపడటం.
-మాట తడబడటం, మాట్లాడటం లేదా మింగడం కష్టంగా అనిపించడం.
-ముఖం ఒకవైపుకు వాలిపోవడం (ఇది పక్షవాతానికి ప్రధాన సంకేతం).
లవ్ బైట్ పడిన వెంటనే చేయాల్సిన చిట్కాలు
-గుర్తు ఏర్పడిన మొదటి 24-48 గంటల్లో, ఒక శుభ్రమైన గుడ్డలో ఐస్ ముక్కలు చుట్టి రోజుకు 3-4 సార్లు 15 నిమిషాల పాటు ఆ మచ్చపై నెమ్మదిగా అద్దాలి. ఐస్ ను నేరుగా చర్మంపై పెట్టకూడదు.
-రెండు రోజుల తర్వాత వాపు తగ్గాక, గోరువెచ్చని గుడ్డతో లేదా హీటింగ్ ప్యాడ్‌తో 15 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
