Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
భారత్‌లో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు..! ప్రధాన కేసులు అవే..!
దేశంలో ఇప్పుడు క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయ్. యువకులే ఈ వ్యాధికి టార్గెట్ కావడం ఆందోళనకలిగించే అంశం. భారత యువతలో క్యాన్సర్ కేసులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయని తాజాగా జరిపిన పరిశోధనలు కూడా చెబుతున్నాయ్. క్యాన్సర్ కేసుల్లో తల క్యాన్సర్, మెడ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని కనుగ్గొన్నారు.
భారత్ నుంచి క్యాన్సర్‌ను నివారించడానికి క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ క్యాన్సర్ కేసుల పట్ట ఓ పరిశోధన జరిపింది. తాము క్యాన్సర్ బారిన పడినట్లు ఈ సంస్థకు వచ్చిన ఫిర్యాదుల్లో 20 శాతం మంది పేషెంట్లు 40 ఏళ్ల లోపేనని బయటపడింది. మే నెలలో మొదటి రెండు వారాల్లో 1368 ఫోన్ కాళ్లు వస్తే అందులో 40 ఏళ్ల లోపున్న వారు 60 శాతం మంది వున్నట్లు తెలిసింది.
అత్యధిక కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చాయని తరువాత ముంబై, న్యూ ఢిల్లీ, మీరుట్ నుంచి వచ్చినట్లు చెప్పారు.
క్యాన్సర్‌లో రకరకాల క్యాన్సర్లు వుంటాయన్న విషయం మనకు తెలిసిందే. భారత దేశంలో ప్రముఖంగా బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, తల క్యాన్సర్, మెడ క్యాన్సర్ కేసులు ఎక్కుగా నమోదవుతున్నాయ్. క్యాన్సర్ ముక్త భారత్ చేపట్టిన పరిశోధనలో తలన , మెడ క్యాన్సర్‌తో బాధపడే వారు 26 శాతంతో వుంటే, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్‌తో బాధపడేవారు 16 శాతం మంది, బ్రెస్ట్ క్యాన్సర్ 15 శాతం మంది, ఇక బ్లడ్ క్యాన్సర్‌తో 9 శాతం మంది బాధపడుతున్నారు.
క్యాన్సర్‌కు సంబంధించి సహాయం కోసం ప్రత్యేకమైన నంబురును కూడా వారు ప్రవేశపెట్టారు. 9355520202. ఈ క్యాన్సర్ ముక్త్ భారత్ సంస్థను క్యాన్సర్ స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ ఆషిష్ గుప్తా స్థాపించారు. భారత్‌ను క్యాన్సర్ నుంచి విముక్త కావడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోందంటున్నారు. ప్రస్తుతం వున్న జీవన విధనం కారణంగా తల, మెడ క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం వుందంటున్నారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో సగానికి పైగా క్యాన్సర్లు చాలా ఆలస్యంగా గుర్తించబడుతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ ముక్త్ భారత్ స్థాపకులు డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపిరు.
భారత్‌లో చికిత్సపోందుతున్నా క్యాన్సర్ పేషెంట్లలో 63 శాతం మంది మూడు లేదా 4వ స్టేజిలో వున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. అధిక బరువు పెరగడం, ఆహార పద్ధతుల్లో తీవ్ర మార్పులు రావడం, లైఫ్‌స్టైల్లో మార్పులు రావడమే క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పొగాకు, మద్యం తాగడం ఆపివేస్తే చాలా క్యాన్సర్ కేసులు తగ్గుతాయని ప్రముఖ ఆంకాలజిస్టులు కూడా సూచిస్తున్నారు.

ఉన్నట్టుండి మీరు ఒకేసారి బరువు తగ్గితే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలసట రావడానికి చాలా కారణాలున్నాయ్. కానీ తీవ్రమైన అలసట కూడా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. రాత్రళ్లు తీవ్రమైన జ్వరం వచ్చి చెమటలు బాగా రావడం, ఎలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కూడా లేకపోవడం క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. శరీరంలో గడ్డలు ఏర్పడడం అక్కడ తీవ్రమైన నొప్పి కలగడం కూడా క్యాన్సర్‌కు వున్న ప్రధాన లక్షణాల్లో ఒకటిగా భావించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications