Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
స్లీప్ మాక్సింగ్ అంటే ఏంటి? నిద్రపట్టక ఇబ్బంది పడుతునోళ్లకు ఇదెలా ఉపయోగపడుతుంది?
ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంత ముఖ్యమో.. కంటినిండా హాయిగా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది రకరకాల కారణాల వల్ల నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నోళ్లు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సోషల్ మీడియాలో స్లీప్ మాక్సింగ్ అనే సరికొత్త ట్రెండ్ ఒకటి వైరల్ అవుతోంది. అసలేంటి ఈ స్లీప్‌మాక్సింగ్? దీనివల్ల నిజంగానే లాభం ఉందా? వంటి పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

స్లీప్ మాక్సింగ్ అంటే ఏమిటి
సింపుల్ గా చెప్పాలంటే.. మన నిద్రను ఒక పద్ధతి ప్రకారం, గరిష్ట స్థాయికి(maximum level) మెరుగుపరుచుకోవడాన్నే స్లీప్ మాక్సింగ్ అంటారు. విశ్రాంతి సమయాన్ని, నిద్ర నాణ్యతను పెంచుకునేందుకు పక్కా ప్లానింగ్ తో కొన్ని అలవాట్లను ఫాలో అవ్వడం ఇందులో భాగం. నిద్రకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడం, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండటం ఇందులో ముఖ్యమైనవి. చాలామంది తమ నిద్రను ట్రాక్ చేసుకోవడానికి స్లీప్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు.
స్లీప్ మాక్సింగ్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
నాణ్యమైన నిద్ర
పక్కమీద వాలగానే సులభంగా నిద్రపట్టేలా ఆరోగ్యకరమైన అలవాట్లను ఇది నేర్పుతుంది. దీనివల్ల మధ్యలో మెలకువ రాకుండా, ఉదయం లేచేసరికి చాలా ఉత్సాహంగా ఉంటారు.
పెరిగే ప్రొడక్టివిటీ
రాత్రి హాయిగా నిద్రపోతే, పగటిపూట ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. దీనివల్ల ఆఫీసులో లేదా ఇంట్లో పనులను చాలా వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు.
శారీరక మరమ్మత్తు
రోజంతా శ్రమించి అలసిపోయిన కండరాలకు, కణజాలాలకు నిద్రలోనే తిరిగి జీవం వస్తుంది. మన పూర్తి ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్రదే కీలక పాత్ర.
మెరుగైన ఏకాగ్రత
కంటినిండా నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం రెట్టింపు అవుతాయి.
ప్రశాంతమైన మనసు
తగినంత నిద్ర మన భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. నిద్రలేమి వల్ల వచ్చే కోపం, చిరాకు తగ్గి.. మానసిక ప్రశాంతత, సంతోషం లభిస్తాయి.
మంచి నిద్ర కోసం నిపుణులు సూచిస్తున్న బెస్ట్ టిప్స్
-ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
-పడుకునే గది చల్లగా, చీకటిగా, ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
-నిద్రపోయే ముందు కాఫీ, టీలు తాగడం లేదా కడుపు నిండా భారీగా భోజనం చేయడం మానుకోవాలి.
-నిద్రకు కనీసం ఒక గంట ముందు టీవీ, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలి.
-పడుకునే ముందు మంచి పుస్తకాలు చదవడం లేదా ధ్యానం చేయడం వల్ల మనసు రిలాక్స్ అవుతుంది.
దీనిలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా?
నిద్రను మెరుగుపరుచుకోవడం వంద శాతం మంచిదే. కానీ పర్ఫెక్ట్ నిద్ర కోసం అతిగా ఆరాటపడటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ నిద్ర దినచర్య గురించి, స్లీప్ స్కోర్ గురించి ప్రతిక్షణం అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగి.. అసలుకే ఎసరు రావచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
