Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
చెవులను క్లీన్ చేయొద్దు!..గులిమి మంచిదే..నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు
చెవి గులిమి అనే ఎవరైనా అంటే ఛీ యాక్ అనేలా మొఖం పెడతారు చాలామంది. చెవిలో గులిమి ఉంటే ఇక నలుగురిలో వెళ్లి నుంచోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ క్రమంలో రకరకాల బడ్స్ లేదా పిన్నీసులు,అగ్గిపుల్లలు, చేతి గోరు వేళ్లను చెవిలోపలికి జొప్పించి ఆ గులిమిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక మనదేశంలో బస్టాండ్లు, రైల్వేస్వేషన్ల దగ్గర అయితే ఓ డబ్బా పట్టుకొని చెవిలోని గులిమి ఈజీగా బయటకు తీసేస్తాం అంటూ వెంటపడేటోళ్లు చాలామందే ఉంటారు. అయితే అసలు చెవిలోని గులిమి బయటకు తీయనక్కర్లేదు..గులిమి చెవుకు రక్షణ కల్పించేదే కానీ హాని చేసేది కాదని ఆడియాలజిస్ట్ అశ్విని నక్కా గారు ఓ వీడియోలో చెప్పారు.
నో క్లోజింగ్ పాయింట్
మన కళ్లు,పెదాల మాదిరి చెవులకు ఎలాంటి క్లోజర్ పాయింట్ ఉండదు. చెవులు నిరంతరం తెరుచుకొనే ఉంటాయి. చెవి ముందుభాగంలోని వెంట్రుకలు, సెబేషియస్ గ్రంథుల నుంచి వెలువడే స్రావాలతో గులిమి తయారవుతుంది. బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చెవి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోడానికే గులిమి అనేది ఏర్పడుతుంది.. ఇదేమీ చెడ్డది కాదు. గులిమికి కూడా ఒక సైకిల్(చట్రం) ఉంటదని అశ్విని అన్నారు.

మనం పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఒకే గులిమి ఉండదని, మొదట్లో తడి రూపంలో గులిమి ఉండి తగినంత దుమ్ము,ధూలిని ట్రాప్ చేస్తుందని ఆ తర్వాత గులిమి గట్టిపడుతుందని ఆ తర్వాత ఇది డీజనరేటివ్ ఫామ్ లోకి మారిపోతుందున్నారు. అప్పుడప్పుడు మన చెవుల్లో నుంచి తెల్లగా పొడి పొడిగా బయటకు వచ్చేదే చివరి స్టేజీ గులిమి అని అశ్విని అన్నారు. చెవులను క్లీన్ చేయాల్సిన అవసరమే లేదని, మన చెవులు నేచురల్ గానే క్లీన్ అవుతాయని అన్నారు. గులిమి తీస్తేనే చెవులు శుభ్రంగా ఉంటాయని కొంతమంది భావిస్తుంటారని, కానీ ఇది నిజం కాదని చాలామందికి దానంతటదే బయటకు వస్తుందని అశ్విని చెప్పారు.
గులిమి తీస్తే ఏమవుతుంది
చెవి బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులు లోపలికి పోకుండా గులిమి స్రవిస్తుందని..అయితే ఈ విషయం తెలియక చాలామంది బడ్ పెట్టి క్లీన్ చేస్తున్నాం అనుకుంటూ తమకు తెలియకుండానే గులిమిని ఇంకా చెవి లోపలికి పంపించి చెవి రంధ్రాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నారని అశ్విని చెప్పారు. ఫలితంగా చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్, వినికిడి లోపం వంటి సమస్యలను కోరితెచ్చుకుంటారన్నారని అశ్విని అన్నారు. చాలా తక్కువ మందిలో చెవిలో గులిమి లోపల పోగవ్వచ్చని, వీళ్లలో చాలా తక్కువ మందికి గులిమి గట్టిపడి చెవి మార్గం నిండిపోవచ్చని.. ఇలాంటోళ్లకు గులిమి తీయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గులిమి తీయడానికి సొంత ప్రయత్నాలు చేయకూడదని, ఈఎన్టీ నిపుణులతోనే గులిమిని తీయించుకోవాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
