Latest Updates
-
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.?
ముఖానికి మేకప్ వేసుకునే ప్రాసెస్‌లో బ్లష్ అనేది చాలా ముఖ్యం. అదే ఫేస్‌ను తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతూ సహజ మెరుపును అందిస్తుంది. అందుకే మార్కెట్‌లో క్రీమ్, పౌడర్, లిక్విడ్ బ్లషర్ చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ చర్మ రకాన్ని బట్టి ఏ బ్లషర్ సెలెక్ట్ చేసుకుంటున్నారనేది కీలకం. మీ స్కిన్ టైప్ బట్టి ఏ బ్లషర్ ఎంచుకోవాలి.. దానిని ఎలా అప్లై చేసుకోవాలి.. ఇక్కడ చూద్దాం..

ప్రతి బ్లషర్‌కి విభిన్నమైన ఆకృతితో పాటు ఫినిషింగ్ ఉంటుంది. ఇది మీ ముఖంపై బ్లష్ చేసేటప్పుడు ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో కొందరి చర్మం జిడ్డుగా ఉంటుంది. మరికొందరికి పొడిగా ఉంటుంది. ఇంకొందరికి ఈ రెండింటి మిశ్రమంతో ఉంటుంది. అందుకే స్కిన్ టైప్ బట్టి బ్లషర్‌ను ఎంచుకోవడం ద్వారా అది ఉత్తమంగా పనిచేస్తుంది.
జిడ్డు చర్మం కోసం
మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే పౌడర్ బ్లషర్ బెస్ట్ ఆప్షన్. ఆయిల్ స్కిన్ ఉన్నవారి ముఖంపై మేకప్ త్వరగా కరిగిపోయి మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అందుకే పౌడర్ బ్లషర్‌ను ఉపయోగించడం ద్వారా ఇది స్కిన్‌పై ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది. ముఖానికి మ్యాట్ ఫినిష్‌ను ఇచ్చి ఎక్కువ సేపు తాజాగా ఉండేలా చేస్తుంది. పౌడర్ బ్లషర్ ఎక్కువ సేపు ఉండటం ద్వారా ఏ కాలంలో అయినా చెదరకుండా ఉంటుంది. న్యాచురల్ లుక్ కోసం మెత్తని పౌడర్ బ్లషర్‌తో సున్నితంగా అప్లై చేసుకోవాలి.

పొడి చర్మానికి
పొడి చర్మం ఉన్న వారికి క్రీమ్ బ్లషర్ ఉత్తమంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం ద్వారా డ్రై స్కిన్‌పై త్వరగా కలిసిపోతుంది. ఆరోగ్యకరమైన, తేమతో కూడిన లుక్ అందిస్తుంది. ఇందులో క్రీమ్ లక్షణం ద్వారా చర్మంపై మచ్చలను తొలగించి న్యాచురల్‌గా గ్లోయింగ్‌ను ఇస్తుంది. ఈ బ్లషర్‌ను అప్లై చేసిన తర్వాత వేళ్లతో లేదంటే మేకప్ స్పాంజ్‌తో సున్నితంగా అద్దాలి. తద్వారా ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది.

సాధారణ లేదా మిశ్రమ చర్మం కోసం
మీ ఫేస్ సాధారణంగా లేదా పొడి, జిడ్డు కలయికతో ఉన్నట్లయితే మీకు లిక్విడ్ బ్లషర్ అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లషర్ ఆకృతి చాలా తేలికగా ఉంటుంది. అందుకే చర్మంలో త్వరగా కలిసిపోతుంది. ఫలితంగా మీ ముఖం సహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఈ లిక్విడ్ బ్లష్‌లో కలర్ చాలా గాఢంగా ఉంటుంది. అందుకే దీనిని తక్కువగా ఉపయోగించాలి. సరిగ్గా ఉపయోగించడం ద్వారా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. సహజంగా అందంగా కనిపించేలా చేస్తుంది.
బ్లషర్ అప్లై చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పనిసరి
మీ ముఖానికి బ్లషర్ అప్లై చేసేటప్పుడు ముందుగా ఫౌండేషన్ లేదా బేస్ మేకప్ సెట్ అవ్వాలి. ఆ తర్వాతే బ్లషర్ వేసుకోండి. ముందుగా బుగ్గల భాగం నుంచి బ్లష్ మొదలుపెట్టి పైకి సున్నితంగా బ్లెండ్ చేస్తుండాలి. ముందుగా కొంచెం కొంచెంగా బ్లష్ చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే సహజంగా అనిపించదు. మీ చర్మ ఛాయకు తగిన షేడ్‌ను ఎంచుకుని బ్లషర్ చేయాలి.
తెల్లని చర్మం వారికి లేత గులాబీ, పీచ్ షేడ్స్ సరిపోతాయి. ఛామనఛాయ రంగు వారికి కోరల్, రోజ్, టెర్రకోట, బెర్రీ టోన్‌లు నప్పుతాయి. బ్లషర్ చేసేటప్పుడు సరైన టెక్నిక్స్‌ను పాటించడం ద్వారా సింపుల్‌గా ఎక్కువగా కష్టపడకుండా మేకప్ చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం తాజాగా, కాంతివంతంగా, సహజంగా కనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications