Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మనిషి శ్రేయస్సుకు పొట్ట ఆరోగ్యం కీలకం, ఆ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ పనులు చేయండి
శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ చాలా కీలకం. తినే ఆహారం జీర్ణవ్యవస్థలో జీర్ణమవుతాయి. వాటి నుంచి పోషకాలు గ్రహించబడి శరీరం అంతటికి అందుతాయి. శరీరానికి శక్తినిచ్చేది, శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఆహారం చాలా కీలకం. జీర్ణ వ్యవస్థలో నోరు, గొంతు, అన్నవాహిక, జీర్ణశయాంతర ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం ఉంటాయి. ఈ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే, తినే ఆహారం సరిగ్గా జీర్ణమై వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

సుమారు 39 ట్రిలియన్ సూక్ష్మజీవులు మన జీర్ణవ్యవస్థలో ఉంటాయి. ఇవే జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే.. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ప్రేగు సమస్యలు సహా ఇతర సమస్యలు చుట్టు ముడతాయి. జీర్ణ వ్యవస్థను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారం:
ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, పెరుగు వంటివి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలతో నిండి ఉంటాయి.
తగినన్ని నీళ్లు తాగాలి:
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. శరీరంలో తగినన్ని నీళ్లు ఉంటే జీర్ణవ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది. ఆరు బయట పని చేసే వారు, వ్యాయామం చేసే వారు ఎక్కువగా నీళ్లు తాగాలి.
రోజూ వ్యాయామం చేయాలి:
వ్యాయామం శరీర ఆరోగ్యాన్ని అన్నిరకాలుగా మెరుగ్గా ఉంచుతుంది. పేగు కండరాల పనితీరును, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. నడవడం, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా ఉంటాం.
ఒత్తిడిని నివారించాలి:
ఒత్తిడి కేవలం మానసికమైనదే అనుకుంటే పొరబడినట్లే. ఒత్తిడి మానసికంగా, శారీరకంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటి వాటితో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
అల్లం టీ:
ఆహారం తిన్న తర్వాత టంబ్లర్ అల్లం టీ తాగితే, అది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెల్లో మంట, కడుపు నొప్పి అజీర్ణాన్ని నివారిస్తుంది. ఏదేమైనా అల్లం లాలాజలాలను ఉత్పత్తి చేస్తుంది. పిత్త, జీర్ణ ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తినే ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం టీ తాగడం మంచిది.
సోంపు:
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోంపు కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్ ఇబ్బందులను తగ్గిస్తుంది. పొట్ట నిండుగా తిని జీర్ణం కావడానికి ఇబ్బంది పడుతుందే నోటిలో కొద్దిగా సోంపు వేసుకుని నమలడం మంచిది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దాని విధిని సక్రమంగా, మెరుగ్గా నిర్వర్తిస్తుంది. నోటి వాసన నివారిస్తుంది. నోరు రిఫ్రెష్ అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
