Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఉదయాన్నే ఈ 7 పనులు చేస్తే చాలు.. ఫాస్ట్‌గా కోటీశ్వరులు అయిపోతారు!, ఆరోగ్యం కూడా!
జీవితంలో విజయం సాధించాలంటే మనస్సులో పాజిటివ్ ఆలోచనలు, ప్రేరణ ఉండటం ఎంతో అవసరం. మన చుట్టూ పాజిటివ్ వ్యక్తులు ఉన్నా.. మన మనసులో మంచి ప్రేరణ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. మనస్సులో సానుకూల భావనలు ఉన్నప్పుడు, ఏ సమయంలోనైనా మనం కష్టాలు ఎదుర్కొన్నా వాటిని అధిగమించి విజయం సాధించగలుగుతాం. మీరు నిరంతరం చెడు ఫలితాలు వస్తున్నా, వాటిని ఎక్కువగా ఎదుర్కొంటుంటే.. ఈ 7 మార్నింగ్ హాబిట్స్‌ను మీ రోజు ప్రారంభంలో చేసేయండి. ఈ అలవాట్లు మీ మనస్సులో సానుకూల ఆలోచనలు జలగపెడతాయి, మరియు మీరు మీరే ప్రేరణను పొందగలుగుతారు. తద్వారా మీరు అనుకున్న పనులన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. ఆ హ్యాబిట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
1. దేవుడిని మొక్కడం:
నిద్రలేచిన వెంటనే, మీ రోజు దేవుడికి మొక్కడం, మొక్కులు చెల్లించడం ద్వారా ప్రారంభించండి. కొంతమంది మంచం నుంచి దిగడమే ఆలస్యం వారికి ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది. బద్దకంతో కూర్చుండిపోతారు. అందుకే ప్రతిరోజూ తమ తమ రోజును ప్రారంభించే ముందు దేవుడి ఫోటో ముందు నిల్చొని వారిని మొక్కి రోజును ప్రారంభించండి, మీ రోజు అద్భుతంగా మారుతుంది.

2. వ్యాయామం చేయడం
ప్రతి రోజూ ఉదయం 5 నిమిషాల వ్యాయామంతో ప్రారంభించడం మంచిది. ఇది మీ శరీరానికి, మనస్సుకు మంచిది. అలాగే మీ జీవితంపై సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. కాలక్రమంలో, మీరు ఈ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు, అది మీరు 30 నిమిషాల వరకు కొనసాగించగలుగుతారు.
3. నీరు తాగడం
నిద్రలేచిన తర్వాత నీరు తాగడం ఎంతో ముఖ్యం. 7-8 గంటలు నిద్ర పోయిన తర్వాత శరీరానికి శక్తి చాలా అవసరం. ఆ శక్తి పొందడానికి మంచి మార్గం నీరు తాగడం. దీని వల్ల మీ మెటాబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలిగిపోతుంది. కాబట్టి, ఉదయం టీ లేదా కాఫీ తీసుకోవడానికి ముందు నీరును తాగి మీ రోజును ప్రారంభించండి.
4. చేయాల్సిన పనులు లిస్ట్ చేసుకోండి
ఉదయం కలిగిన సానుకూల శక్తితో, ఆ రోజు చేయాల్సిన పనులను జాబితా చేయండి. అవి మీకు ఆ రోజు మైలురాయిలను చేరుకునేందుకు ప్రేరణను ఇస్తాయి.
5. ఫోన్‌ను దూరంగా ఉంచండి
ఉదయం లేచిన వెంటనే, మీ మొబైల్, ల్యాప్టాప్ లేదా టీవీ నుంచి దూరంగా ఉండండి. గడియారాన్ని చూసి సమయాన్ని చూసుకోండి. ఫోన్ పట్టుకోవడం వల్ల మీరు అనవసరమైన మెసేజ్లు, మెయిల్స్ లేదా సోషల్ మీడియా అప్ డేట్స్‌తో సమయాన్ని వృథా చేస్తారు, అలాగే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
6. ఆరోగ్యకరమైన అల్పాహారం
ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం ముఖ్యమైనది. ఉదయం పండ్లు, గింజలు, మొలకెత్తిన గింజలు వంటి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మరియు మెదడుకు మంచి శక్తి అందుతుంది, తద్వారా మీరు మొత్తం రోజు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
7. ప్రస్తుత పనిలో దృష్టి సారించండి
మీరు చేస్తున్న పనిని పూర్తి మరిచిపోకుండా దృష్టిని కేంద్రీకరించండి. ఇతర ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వకండి. దీనివల్ల మీరు పనిని సరిగ్గా పూర్తి చేయగలుగుతారు, సమయం వృథా చేయకుండా కచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ 7 అలవాట్లు మీ మనస్సులో సానుకూల ఆలోచనలన్నింటిని పెంచుతూ, విజయాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications