Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డయాబెటీస్ రోగులకు చర్మ సంరక్షణ!

డయాబెటిక్ రోగులకు శరీరంనుండి రక్తంలో అధిక షుగర్ కారణంగా ద్రవాలు నష్టపోతూంటాయి. దానితో వారికి కాళ్ళు, మోచేతులు, పాదాలు వంటి శరీర భాగాలలో చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం అపుడు పగులుతుంది. ఆ పగుళ్ళలోకి క్రిములు చేరతాయి. ఇన్ ఫెక్షన్ కలిగిస్తాయి. కనుక చర్మ సంరక్షణ వీరికి ప్రధానం. చర్మానికి వచ్చే చిన్న సమస్యలే తీవ్రమై క్లిష్ట సమస్యలుగా వుంటాయి.
డయాబెటిక్ ఫుట్ , కాలిగాయాలు, వంటివి చివరకు కాలు తొలగించే స్ధితికి తీసుకువస్తాయి.
కనుక డయాబెటీస్ రోగులు చర్మాన్ని ఎప్పటికపుడు మంచి కండిషన్ లో వుంచాలి. ఏ రకమైన సమస్యలు చర్మానికి వుంటాయి? చర్మానికి పొడిబారటం, పగలటం మరి కొన్ని సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మం రంగు కూడా మారుతుంది. చర్మం పలుచబడుతుంది. దద్దుర్లు, పుండ్లు ఏర్పడి త్వరగా నివారణ కావు. సత్వరమే వీరికి వైద్య చికిత్సలు అవసరమవుతూంటాయి. ప్రతిరోజూ వీరు నిద్రించే సమయంలో తమ పాదాలను పరీక్షించుకోవాలి. పాదాలు రక్తప్రసరణ సరిగా లేక తిమ్మిర్లు ఎక్కుతూంటాయి. స్పర్శ తగ్గిపోతుంది.
కనుక డయాబెటీస్ రోగులు ఎప్పటికపుడు తమ చర్మ సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సలహాలను పాటిస్తూ వుండాలి. తినే ఆహారాలపట్ల జాగ్రత్త వహించాలి. రక్తంలోని షుగర్ స్ధాయిలు ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ షుగర్ వ్యాధి మందుల వాడకం లేదా ఇన్సులిన్ వాడకం వంటివి ఆచరించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications