Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మూత్ర పిండాలకు నష్టం కలిగించే డయాబెటీస్!

డయాబెటీస్ వ్యాధి బాగా ముదిరిపోతే, కిడ్నీలు దెబ్బతింటాయి. డయాబెటిక్ నెఫ్రోపతీ అనే వ్యాధి టైప్ 1 మరియు టైప్ 2 డాయబెటీస్ రోగులలో కనపడుతుంది. కిడ్నీలకు నష్టాన్ని కలిగించే ఈ వ్యాధిని అయిదు దశలుగా విభజిస్తారు. చివరి దశ షుమారుగా 20 సంవత్సరాల డయాబెటీస్ చరిత్ర దాటితే వచ్చేస్తుంది. కిడ్నీ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయి? ఈ వ్యాధి బాగా ముదిరిన తర్వాత కాని కనపడదు. నాలుగవ దశకు చేరేసరికి లక్షణాలు ఎలావుంటాయంటే...కాలిమడమలు, పాదాలు, కాలి కింది భాగం లేదా చేతులు నీరు పడతాయి. మూత్రం చిక్కగా వస్తుంది. మూత్రంలో రక్తం కనపడుతుంది. శ్వాస తీయటం కష్టం అవుతుంది. మెట్లు ఎక్కడం వంటివి చేయలేరు. రక్తంలో ఆక్సిజన్ తక్కువై అలసట కలుగుతుంది. వికారం, వాంతులు కలుగుతూంటాయి.
కనుక డయాబెటీస్ రోగులు సంవత్సరానికొకసారి కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఈ పరీక్ష మూత్రం పరీక్షలోనే చేస్తారు. కిడ్నీలు మూత్రాన్ని ఫిల్టర్ చేయలేకపోతాయి. మీ బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణపై ఎంతకాలంలో కిడ్నీల సమస్య వస్తుందనేది ఆధారపడి వుంటుంది. ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ప్రారంభ దశలోనే దీనిని కనుగొనవచ్చు. కిడ్నీలు చెడిపోయాయని చెప్పేందుకు లక్షణాలు ఎలా వుంటాయి? కాలి కిందిభాగం వాపు, నీరు పట్టడం, మూత్రం చిక్కగా రావడం, శ్వాస కష్టమవడం, వాంతులు రావడం జరుగుతుంది.
కిడ్నీలకు జరిగిన నష్టాన్ని బట్టి ఈ వ్యాధిని ఆహారంతో కూడా చికిత్స చేయవచ్చు. అధిక రక్తపోటు వుంటే, కిడ్నీ త్వరగా చెడిపోతుంది. అయితే, కిడ్నీ దెబ్బతినడాన్ని నెమ్మదించవచ్చు. అందుకుగాను రక్తపోటు చికిత్స తీసుకోవాలి. దీని వైద్యం వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్ధితి, గత వైద్య విధానం, నష్టపోయిన పరిస్ధితి, వ్యక్తిగత నియంత్రణ వంటివాటిపై ఆధారపడి వుంటాయి. డయాబెటీస్ చికిత్స వలెనే, దీనికి కూడా వ్యాయామం, బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణలపై ఆధారపడివుంటుంది. అవసరపడితే, కిడ్నీలు మార్చవలసి కూడా వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications