Latest Updates
-
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
షుగర్ ఉన్న మహిళలలు గర్భం దాల్చితే...?

మధుమేహం మూలంగా పిల్లలు కలగరేమో అన్నసమస్య అంటూ ఏమీ ఉండదు. అయితే మధుమేహం మూలంగా తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం మాత్రం లేకపోలేదు.పిండం ఏర్పడే గర్భధారణ దినాలలోనూ, గర్భాన్ని దాల్చిన 8 వారాల దాకానూ బ్లడ్ గ్లూకోజ్ స్థాయి 7 శాతాన్ని మించి ఉంటే అది కడుపులో బిడ్డ పెరుగు దలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకనే గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకుంటూ డాక్టరు పర్యవేక్షణలో ఉండటం అవసరం. గర్భిణీ స్త్రీ రక్తంలో గ్లూకోజ్ అధికస్థాయిలో ఉంటే ఆమె కడుపులో ఉన్న పాపాయి రక్తంలో కూడా గ్లూకోజు అధికస్థాయిలో ఉంటుంది.
ఇందుకు కారణం ఏమిటంటే తల్లి రక్తంలోని గ్లూకోజు ‘మాయ' ... ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. కాని ఇన్సులిన్ ఆవిధంగా ప్రవేశించలేదు.దానితో కడుపులో పాపాయి రక్తంలో గ్లూకోజ్ అధికమవుతుంది. దీనివల్ల కడుపులో బిడ్డ సాధారణం కన్నా వేగంగా బరువు పెరగటం ప్రారంభిస్తాడు. కడుపులో బిడ్డ మామూలుకన్నా వేగంగా పెరగటంతో శరీర పరిమాణం పెద్దగా ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయంలో ఆమె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే పుట్టే బిడ్డకు శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
టైప్ 1 డయాబెటిస్ కల స్త్రీ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్ షూగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో కీటోన్స్ అనబడే విషపదార్థాలు ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ ‘కీటోన్స్' చాలా అపకారాన్ని కలగజేస్తాయి. చాలా అరుదే అయినా ఒకోసారి బిడ్డకు ప్రాణాపాయమూ కలగవచ్చు.
మధుమేహం గల స్త్రీ గర్భాన్ని దాల్చినప్పుడు ప్రెగ్సెన్సీ రోజుల్లో బ్లడ్ షూగర్ పెరగకుం డా ఉండటానికి ఈ కింది జాగ్రత్తల్ని తీసుకోవటం అవసరం.
1. న్యూట్రిషనిస్టు సలహామేర ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం
2. రెగ్యులర్‌గా ఏదో ఒక యాక్టివిటీతో శరీ రాన్ని చురుకుగా ఉంచటం - వాకింగ్‌కి వెళ్ళ టం, మృదువుగా జాగింగ్ చేయటం.
3. ఈ రోజుల్లో డైటింగ్ అసలు చేయకూడదు.
4. ఏదైనా అస్వస్థతలకు గురయితే రక్తంలో గ్లూకోజు స్థాయి అధికమ వుతుంది. కాబట్టి ఇట్లాంటి రోజుల్లో డాక్టరు సలహామేర ఇన్సులిన్‌ని ఇంకాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి రావచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications