Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
నోరు ఎండిపోతూంటే....ఎంతో అసౌకర్యం?

నోరు ఎండిపోయినపుడు ఎంతో అసౌకర్యంగా చికాకుకలిగిస్తూ వుంటుంది. ఈ రకంగా ఎండిపోయిన నోరు బాక్టీరియాకి కూడా నివాస స్ధానం అవుతుంది. రకరకాల సూక్ష్మ క్రిములు చేరుతూంటాయి. నోటిలో ఊరే లాలాజలం సాధారణంగా మననోటిలోని హాని కలిగించే అనేక రకాల క్రిములను సంహరిస్తుంది. మీరు తినే ఆహారంలో సైతం వుండే హాని కలిగించే క్రిములు లాలాజలంలోని ఎంజైములు, మేలు చేసే బాక్టీరియా వంటి వాటితో తిన్న ఆహారాన్ని మొదటి దశలో జీర్ణం చేస్తాయి. మానవుడు తినే ఆహార జీర్ణక్రియలో మొదటి దశ నోటిలోని లాలాజలంతోనే జరుగుతుంది.
నోటిలో ఏ రకమైన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. నోటి ఇన్ఫెక్షన్ కలిగితే అది మీ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలపై ప్రభావం చూపుతుంది. లాలాజలం అధికంగా వుంటే బాక్టీరియా నోటిలో తక్కువగా వుంటుంది. దంతాలు, చిగుళ్ళపై వుండే యాసిడ్లను లాలాజలం కడిగేసి సమస్ధాయిలో వుంచుతుంది.
నోరు ఎండిన లక్షణాలు ఎలా వుంటాయి?
నోటిలో తడి లేకుండుట
నోటి మూలలలో మంట పెట్టుట
చిగుళ్ళు మంట పెట్టుట దీనినే జింజివైటిస్ అంటారు
నాలుక, బుగ్గలు, అంగిడి భాగాలలో క్రిమి వ్యాధులు కలుగుట
నోరు ఎండే కారణాలేమిటి?
తరచుగా రక్తంలో గ్లూకోజ్ స్ధాయి అధికంగా వుండుట. ఇది డయాబెటీస్ రోగులలో వుంటుంది. ఇతర కారణాలుగా, మీరు తగినంత నీటిని తాగకపోవటం, పొగ త్రాగటం లేదా ఏదేని మందు వేసినపుడు సైడ్ ఎఫెక్ట్ కారణంగా నోరు ఎండిపోవటం.
దీనిని ఎలాపరిష్కరించాలి?
మీ దంతాలను ప్రతి భోజనం తర్వాత శుభ్రం చేయండి. బెడ్ కి వెళ్ళే ముందు తప్పక బ్రష్ చేయండి ఎల్లపుడు శరీరంలో తగినంత నీటిని వుంచండి. ఒక బాటిల్ నీరు ఎల్లపుడూ వెంట వుంచుకోండి. ఆల్కహాల్ లేని మౌత్ వాష్ తో శుభ్రం చేయండి. పెదవులు పొడిబారినా లేక, మంట పెడుతున్నా, వాటిపై ఏదేని క్రీమ్ రాయండి. ప్రత్యేకించి మూలలలో అంటే నోటి వద్ద. సాధ్యమైనంత వరకు మీ బ్లడ్ షుగర్ స్ధాయిలను సిఫార్సు చేసిన రేంజిలో వుంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
