Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
డయాబెటిస్ లక్షణాలను ఎలా గుర్తించాలి...?

మాటిమాటికీ మూత్రాన్ని అతిగా విసర్జించటం: రక్తంలోని గ్లూకోజ్ పరిమాణం ఒక స్థాయికి మించి చేరుకున్నప్పుడు ఆ అధిక గ్లూకోజ్‌ని మూత్ర పిండాలు రక్తం నుండి వేరు చేస్తాయి. వేరు చేసిన గ్లూకోజ్‌ని విసర్జించటం కోసం మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. మూత్రం ఎంతగా ఉత్పత్తి అవుతోంటే అంత తరచుగా ఆ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంటుంది. మాటిమాటికీ మూత్ర విసర్జన చేయటాన్ని పగలు ఎవ రూ అంతగా గమనించరు. కాని రాత్రులు రెండు మూ డు సార్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.
నోరు పొడారటం, అతిగా దప్పిక: మూత్రాన్ని అధికంగా విసర్జించుతున్నప్పుడు శరీరంలో నీరు తగ్గుతుంటుంది. దానితో నోరు పొడారటం, దప్పిక మొదలవుతాయి. దప్పికను తీర్చుకోవడం కోసం తీపి పానీయాల్ని తీసు కుంటే రక్తంలో గ్లూకోజ్ ఇంకా పెరిగి సమస్య మరింత జటిలమవుతుంది. అందువల్ల తీపి పదార్థాలు లేని మంచినీళ్ళు తాగటమే ఉత్తమం.
నీరసం, బలహీనత: ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించి రోజువారీ కార్యక్రమాల్ని చేసుకోవటం కష్టసాధ్యంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎప్పటికంటే ఎక్కువగా రెస్టు తీసుకున్నా లేక నిద్రపోయినా మరింతగా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరానికి శ్రమంటూ లేకుండా ఉండే వారికి రక్తంలోని గ్లూకోజ్ శరీర కణ జాలంలోకి ప్రవేశించలేక రక్తంలోనే మిగిలి అధికం కావటం వల్ల ఇలా జరుగుతుంది. అలసటగా ఉన్నాసరే ఇలాంటి సమయంలో శరీరానికి ఎంతోకొంత శ్రమను కల్పిస్తే గ్లూకోజ్ శరీర కణాలలోకి ప్రవేశించి రక్తంలో అధికం కాకుండా ఉంటుంది.
బరువు తగ్గిపోవడం: రక్తంలోని గ్లూకోజ్‌ని వినియోగించ లేకపోయేసరికి శరీరం కండరాలలోనూ, వేరే చోట్లా ఉన్నా కొవ్వు నిలవల్ని శక్తి కోసం వినియోగించుకోవటం ప్రారంభిస్తుంది. దీనితో శరీరపు బరువు తగ్గడం ప్రారం భమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో స్థూలదేహం కలవాళ్ళు ఏ ప్రయత్నమూ చేయకుండానే బరువు తగ్గిపోతున్నాం కదా అని సంతోషిస్తారు. ఇలా బరువు తగ్గటం అంత ఆరోగ్యకరం కాదు. డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవటం మొదలవగానే వీళ్ళు మళ్లీ పూర్వపు బరువుకు చేరుకుంటారు.
మసక చూపు: రక్తంలో గ్లూకోజ్ పరిమాణం అధికం కాగానే కంటి కట కాలు గ్లూకోజ్‌ని, నీటినీ పీల్పుకోవటం మొదలెడతాయి. దీనితో అవి ఉబ్బి చూపు మసకేస్తుంది.
శ్వాసలో తీపివాసన: ఇది ఆఖరి లక్షణంగా కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నదనేందుకు సూచన ఇది. శక్తి కోసం శరీరం తనలోని కొవ్వు నిలవల్ని ఉపయోగించుకోవటం మొదల వగానే కీటోన్స్ అనబడే విషపదార్థాలు తయారవుతుంటాయి.శ్వాసలో తీపివాసన మొదలయిందంటే ఊపిరితిత్తుల ద్వారా శరీరం కీటోన్స్ ని విసర్జింపజేయటానికి ప్రయత్నిస్తోందని అర్థం చేసుకోవాలి. దీనితో పాటు తెమలటం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి కూడా మొదలయాయంటే వెంటనే చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించడం చేయాలి. కీటో అసిడోసిస్‌కి అర్జెంటుగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా జరగటం చాలా అరుదే అయినా జరిగితే మాత్రం ప్రమాదం ఎక్కువ.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: మూత్రంలోంచి గ్లూకోజ్ అధికంగా పోతోంటే ఆ భాగాన బాక్టీరియా, సూక్ష్మక్రిములు అధిక సంఖ్యలో అభివృద్ధి చెందే అవ కాశం ఉంది.దానివల్ల మూత్రనాళం, యోని, ఇన్‌ఫెక్షన్లకు గురికావటం, తెల్లబట్ట, పురుషాంగం చివరిభాగాన ఉండే చర్మంపై పగుళ్లు, పుళ్ళు, చీము పట్టటం, ఫంగస్ చేరటం లాంటి లక్షణాలన్నీ చోటు చేసుకుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
