Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
ప్రి డయాబెటీస్ అంటే ఏమిటి? అది వస్తే ఏం చేయాలి?

ప్రి డయాబెటీస్ ను గుర్తించటానికి రెండు టెస్టులు వున్నాయి.
1. ఫాస్టింగ్ ప్లాస్మ గ్లూకోజ్ టెస్ట్
2. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్.
ఈ టెస్టుల ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ను నిర్ధారించి ఒక వ్యక్తి ప్రి డయాబిటీస్ లేక డయాబెటీస్ తో బాధ పడుతున్నాడా అని స్పష్టంగా నిర్ధారించవచ్చు. ఆహారంలో నియంత్రణ, రెగ్యులర్ వ్యాయామం, బాడీ వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడటం, అదనపు వెయిట్ ను తగ్గించకోవటం విధిగా చేసి తీరాలి.
షుగర్ ఉందని తొలిసారిగా తెలిసినపుడు చాలామంది విచార పడిపోతారు. చాలా బాధ పడతారు. నాకెందుకు వచ్చింది. నేను చాలా ఆరోగ్యంగా వుంటాను. అధిక దప్పిక లేదు, అధిక ఆకలి లేదు, బ్లడ్ విజన్ లేదు, వెయిట్ లాస్ లేదు, ఓ విధంగా చెప్పాలంటే, డాక్టర్ గారూ మీరు చెప్పే డయాబిటీస్ లక్షణాలలో నాకు ఒక్కటీ లేదు. నాకు షుగర్ వుండటం ఏమిటి మా అమ్మ నాన్నలకు షుగర్ లేదు. మా బంధువులలో ఎవరూ షుగర్ తో బాధపడేవారు లేరు నాకు రావటం ఏమిటీ అంటూ వాపోతారు.
నేను మందులెలా వాడాలి? బ్లడ్ షుగర్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తింటే నా షుగర్ పెరుగుతుంది? ఏ పండ్లు తినవచ్చు? ఇక నేను పరమాన్నం వంటి స్వీట్లు తినకూడదా? ఇలా ప్రశ్నల వర్షంతో డాక్టర్లను ముంచెత్తుతారు. తక్షణం తన దుష్ప్రభావాన్ని చూపకపోయినా, లాంగ్ రన్ లో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులు, కంటి చూపుపోవటం వంటి విపరీత పరిస్ధితులకు దారి తీస్తుందన్న భయంతో షుగర్ వ్యాధి అంటేనే వణికిపోతారు కొందరు. ఇకపై తను స్వేచ్ఛగా తినే అవకాశం లేదని కొందరు మానసికంగా కుంగిపోతారు. ఇంతేకాదు వీరిలో షుగర్ వ్యాధిపట్ల ఎన్నో రకాల అపోహలుంటాయి. ఆ అపోహలన్నింటిని కూడా వీరు తొలగించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
