Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మధుమేహమా ? ఐతే ఈ నియమాలు కంపల్సరీ
ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా.. అందరినీ వెంటాడుతున్న సమస్య మధుమేహం. వయసు పైబడిన వాళ్లనే కాదు.. చిన్న వయసులోనే డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కేవలం చక్కెర పదార్థాలకు మాత్రమే కాదు.. కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అసలు మధుమేహంతో బాధపడేవాళ్లు.. తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. మధుమేహం ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి అధ్యయనాలు. పాలలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ర్టాల్ పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి బట్టర్, మీగడ పెరుగు, నెయ్యికి దూరంగా ఉండాలి. అవసరమైతే మీగడ తీసిన పెరుగు, మజ్జిగ, టోన్డ్ మిల్క్ తీసుకోవడం మంచిది.

మధుమేహంతో బాధపడేవాళ్లు పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది. పండ్ల రసాల వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని డైరెక్ట్ గా తినడం వల్ల ఎక్కువ పీచు పదార్థం పొందవచ్చు.
బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, గోధుమలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే.. వైట్ బ్రెడ్, వైట్ ఫ్లోర్, వైట్ రైస్ కి ఎంత నో చెబితే అంత మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది.

ఇక చిరుతిల్ల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఆలూ చిప్స్, పకోడి, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తీసుకోకపోవడం మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశముంది. అలాగే కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications