Latest Updates
-
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
షుగర్ ఉన్నవాళ్లు ఏ పండ్లు తినాలి? ఇదిగో నిపుణుల సలహాలు
షుగర్ వ్యాధి పేరు వింటేనే చలామందికి వెన్నెలో వణుకు పుడుతుంది. దీనికి కారణంగ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు గానీ పూర్తిగా నియంత్రించలేం. షుగర్ వ్యాధిని 100శాతం నయం చేసే మెడిసిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక ప్రపంచంలో ఏ దేశంలోని లేనంతమంది షుగర్ వ్యాధిగ్రస్థులు మన దేశంలోనే ఉన్నారు. అందుకే భారతదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధానిగా పిలుస్తుంటారు. షుగర్ వచ్చాక ఏది తినాలి, ఏది తినకూడదు అనే చాలా సందేహాలు, అనుమానాలు ఉంటుంటాయి.
షుగర్ వచ్చాక చాలామంది పండ్లు తినడం మానేస్తుంటారు, అయితే షుగర్ పేషెంట్లు పండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ పేషెంట్లు ఏ పండుల తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారు?
షుగర్ పేషెంట్లు సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచని పదార్థాలు అని అర్థం. మామిడి వంటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నా, చక్కెర శాతం కూడా ఎక్కువే. అందుకే వాటిని అల్పాహారంగా, భోజనాల మధ్యలో కొద్ది మొత్తంలో తీసుకోవాలి. అన్నం లేదా చపాతీ వంటి పిండిపదార్థాలతో కూడిన భోజనం చేశాక వెంటనే ఈ పండ్లను తింటే కేలరీలు, చక్కెర రెండూ పెరిగిపోతాయి. కనుక, కొన్ని పండ్ల విషయంలో ఆచితూచి అడుగేయాలి.
ఏవి తినాలి?
- స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నేరేడు పండ్ల వంటివి తినడం ఉత్తమం. వీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి.
-అరటిపండుకు బదులుగా జామపండు: బాగా పండిన అరటిపండు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే దీనికి బదులుగా జామపండును మీ డైట్‌లో చేర్చుకోండి. జామలో విటమిన్-సి, ఫైబర్ (పీచుపదార్థం) అధికంగా ఉంటాయి. 100 గ్రాముల జామపండులో కేవలం 5 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ.

సపోటాకు బదులుగా యాపిల్: తియ్యగా, గుజ్జుగా ఉండే సపోటా పండులో చక్కెర స్థాయి చాలా ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 65-70 వరకు ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో లేనివాళ్లు దీనికి దూరంగా ఉండటమే బెటర్. దీనికి బదులుగా రోజుకో యాపిల్ తినడం ఎంతో మంచిది. యాపిల్‌లో ఉండే ఫైబర్, రక్తంలో చక్కెర నెమ్మదిగా కలిసేలా చూస్తుంది. ఫైబర్ ఒక ఫిల్టర్ లా పనిచేసి, గ్లూకోజ్ వేగాన్ని నియంత్రిస్తుంది.
ద్రాక్షకు బదులుగా నేరేడు పండ్లు: రసాలూరే ద్రాక్ష పండ్లలో కూడా చక్కెర శాతమెక్కువే. సాధారణంగా 100 గ్రాముల ద్రాక్షలో 16-20 గ్రాముల చక్కెర ఉంటుంది. వీటికి బదులుగా సీజన్ లో దొరికే నేరేడు పండ్లను తినవచ్చు. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచే గుణాలు కూడా ఉన్నాయి.
పైనాపిల్ కు బదులుగా బొప్పాయి: పైనాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కొన్ని ముక్కలు తిన్నా షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులుగా బొప్పాయి పండును నిరభ్యంతరంగా తినవచ్చు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తో నిండిన బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాక, మధుమేహులకు సురక్షితమైన పండు కూడా.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications