Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
అధిక బరువుకు ప్రభావితం చేసే సామాజిక అంశాలు.. చిట్కాలు

సామాజిక సంబంధాలు: ఇవి బరువు మీద ప్రభావాన్ని చూపిస్తాయా? అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకున్న పరిచయాలు కూడా బరువును ఎక్కవ చేయడం లేదా తక్కువ చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకి భోజన ప్రియుల ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఆహారపు అలవాట్లలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. మీకు తెలియకుండానే ఆహారం ఎక్కువ తీసుకుంటారు. ఇలాంటి పరిచయాలు, సంబంధాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
హోటళ్ళు, రెస్టారెంట్లు: ఆహార నియంత్రణ పాటిస్తూనే వారంలో ఒకటి రెండు సార్లు వీటికి వెళ్ళినా మీ నియమాలు గంగలో కలిసినట్లే. తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారు కనీసం వీటి వంక చూడను కూడా చూడకూడదు.
వాహనాలు: ఇవి ఊబకాయాన్ని పెంచి పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని మూల పడేస్తేనే మంచిది. సమయం కలిసి వస్తుందని వీటిని అప్పుడప్పుడు ఉపయోగించినా శారీరక శ్రమకు దూరం అయినట్లే.
ఆకలిని గుర్తించలేకపోవడం: ఆకలి తెలియకపోవడం అంటూ ఉంటుందా?అని అనుకోకుండి. భోజనం చేసిన మూడు నాలుగు గంటల వరకు ఘనాహారం తీసుకోకూడదు. ఇది అందరికీ తెలిసిందే. కొందరికి గంటా, రెండు గంటలలోనూ ఆకలి అనిపించి ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టుకుంటారు. భోజనం అయిన ఒకటి రెండు గంటల తర్వాత ఆకలిగా అనిపిస్తే పళ్ళు, లేదా కూరగాయల ముక్కలు, నీరు లాంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవగాహన అవసరం: శరీరం ఎత్తు, వయస్సును అనుసరించి బరువు తగ్గాలో, పెరగాలో అవగాహనకు రావాలి. ఈ విషయంలో అవసరం అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి.
క్యాలరీలు ఖర్చు: ఏ వ్యాయామం చేస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోజుకి ఓ మైలు దూరం నడిచినా లేదా పరిగెత్తినా సుమారు వంద క్యాలరీల దాకా ఖర్చు అవుతాయి. అదే రోజుకి ఐదు మైళ్ళు నడిచినట్టయితే వారంలో ఓ పౌండు బరువుతగ్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications