Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
నియమాలు పాటిస్తే బరువు నియంత్రణ సాధ్యమే....!

కొంతమంది ఆహారం విషయంలో తమను తాము నియంత్రించుకోలేక కొన్ని పదార్థాలను అతిగా తినేస్తుంటారు. ఒత్తిడి లేదా ఆందోళగా అనిపించినప్పుడు అధిక కెలోరిలు లేదా కొవ్వు శాతం ఎక్కువగా ఉండే వాటిని మోతాదుకు మించి తింటారు. ఒకే పదార్థాన్ని పదే పదే తీసుకోవడం.. ఆ తర్వాత బరువు పెరుగుతామనే భయంతో తీసుకున్న ఆహారాన్ని ఏదో ఒక రూపంలో వెలుపలికి పంపే ప్రయత్నం చేయడం లాంటివన్నీ ఆనారోగ్యకరమైన లక్షణాలే. పురుషులతో పోలిస్తే మహిళల్లో అదీ యువతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తాము అవసరానికి మించి తింటున్నామనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. దాంతో తామేదో తప్పు చేశామనే భావనలో ఉంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందనే కారణాలు ఇంకా నిర్థారణ కాకపోయినా వంశపారంపర్యం, మానసిక స్థితి, కుటుంబం, సామాజిక పరిస్థితుల వంటివన్నీ ఈ సమస్యకు కారణమవుతాయని అధ్యకనాల్లో తేలింది.
లక్షణాలు గుర్తించడం: రోజులో ఎక్కువసార్లు తినేస్తుంటారు. కొన్నిసార్లు అధిక కెలోరీలకు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే దానివల్ల బరువు పెరగకుండా ఉండటానికి వాంతి చేసుకోవడం, విరేచనం రావడం కోసం ప్రత్యేక మాత్రలు వాడటం.. అతిగా వ్యాయామాలు చేయడం, ఎనీమా లాంటి పద్దతుల్ని ఎంచుకుంటారు. వాస్తవానికి వీరు సాధారణ బరువులోనే ఉంటారు కానీ.. తామేదో స్థూలకాయులమనే భ్రమలో ఉంటారు. కొన్నిసార్లు అవసరానికి మించి వ్యాయామం చేస్తుంటారు.
ఇలాంటి లక్షణాలను గుర్తించడం సులువే... అదేపనిగి వాంతులు చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. అలాగే.. కళ్లల్లోని రక్తనాళాలు.. నోరు పొడి బారడం, దద్దుర్లు, మొటిమలు.. వేళ్లు నోట్లో పెట్టుకుని వాంతి చేసుకోవడం వల్ల వేళ్లపై చిన్న గాట్లు.. డీహైడ్రేషన్ లాంటివన్నీ ఈ లక్షణాలను తెలియజేస్తాయి.
కాబట్టి వీటి పరిష్కారానికి: సమస్య తీవ్రమై వైద్యుల్ని సంప్రతించినప్పుడు బిహేవియరల్ లేదా న్యూట్రిషనల్ థెరపిని నిపుణులు సిఫారసు చేస్తారు. దైనందిన జీవితంలో చేసుకునే చిన్నచిన్న మార్పులు ఎంతో మేలుచేస్తాయి. ఒక పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ మోతాదును తగ్గించాలి. దాన్ని కొనసాగిస్తే ఎంతో మార్పు ఉంటుంది. ఆహారవేళలు పాటించాలి.
నిర్ణీత సమయాల్లోనే ఆహారం తీసుకోవాలి. ఆందోళన కలిగిన సమయంలో ఏదో ఒకటి తినేయాలనే అలవాటును సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి. అప్పుడే కేవలం ఆకలి ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నిస్తాం. తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, ఆకు కూరలు, సీఫుడ్..తాజా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే డిహైడ్రేషన్ తో పాటు ఇతర సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications