For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకర ఆహార తయారీలో నూనెల వాడకం ఎలా?

By B N Sharma
|

ఆరోగ్య కర జీవన విధానం ఆచరిస్తూ, శరీర బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా కూడా ఉండాలంటే, సరైన వంటనూనె ఎంపిక చేయటం కష్టమే. తక్కువ కేలరీలు కల ఆరోగ్యకర ఆహారం ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. మీ బరువును తగ్గించేస్తుంది. కొద్ది పాటి వ్యాయామాలు చేస్తే చాలు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ప్రధానంగా ఆహార తయారీలో వాడే నూనెలు మీ శరీరంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను నియంత్రించేవిగా ఉండాలి. అసలు పూర్తిగా కొవ్వు, నూనెలు లేని ఆహారాలు రుచి పచి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.ఆరోగ్యకర నూనెలు, కొవ్వులు వాడేందుకు కొన్ని చిట్కాలు పరిశీలించండి.

Using Fats and Oils In A Healthy Diet!

ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా చెడు - ఆహార తయారీ ప్రక్రియలో ఏర్పడే శాట్యురేట్ కాని కొవ్వులు లేదా సింధటిక్ లేదా ఇండస్ట్రియల్ ట్రాన్స్ ఫ్యాట్ మీ శరీరంలో ఎల్ డిఎల్ అంటే చెడు కొల్లెస్టరాల్ పెంచుతుంది. ఆరోగ్యకరమైన హెచ్ డిఎల్ కొల్లెస్టరాల్ ను తగ్గిస్తుంది. దీనితో గుండె జబ్బులు వస్తాయి. ఆలివ్ నూనె వాడకం మంచిది. దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్లను తగ్గిస్తాయి. మంచి కొల్లెస్టరాల్ స్ధాయి అలానే ఉంచుతాయి.

సాధారణంగా తయారీ దారులు రెండు లేదా మూడు రకాల తయారీ ప్రక్రియతో అంటే, సలాడ్లకు, వంటలకు వివిధ రకాలుగా నాణ్యతను బట్టి తయారు చేస్తారు. ఎప్పటికి వీలైనంతవరకు ఖరీదు అయినప్పటికి నాణ్యతకల వంటనూనెలు మాత్రమే వాడండి.

రైస్ బ్రాన్ ఆయిల్ -
దీనినే తవుడు నూనె అని కూడా అంటారు. దీనిలో సహజమైన విటమిన్ ఇ ఉంటుంది. ఇది కూడా కొల్లెస్టరాల్ నియంత్రిస్తుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్ - దీనిలోని లినోలిక్ యాసిడ్ కొలెస్టరాల్ స్ధాయిలను నియంత్రిస్తుంది. వేరే నూనెలతో చేస్తూ అపుడపుడూ దీనిని వాడవచ్చు.
మస్టర్డ్ నూనె లేదా ఆవ నూనె. దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది తక్కువగా వాడండి.
వేరుశనగ నూనె - ఈ నూనె చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలను మన శరీరంలో తగ్గిస్తూ మేలు చేస్తుంది. మంచి కొల్లెస్టరాల్ తగ్గించదు.
కొబ్బరి నూనె - దీనిలో అసలు కొలెస్టరాల్ ఉండదు. కనుక దీనిని వంటలలో వాడవచ్చు. అయితే మితంగా వాడండి.

నూనెలను గాలి చొరని డబ్బాలలో చల్లటి, పొడి ప్రదేశాలలో నిలువ చేయండి. నూనెలను అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసి నిలువ చేయండి. కొవ్వులు రసాయనాలకు చెందిన లిపిడ్ గ్రూపులో భాగం. ప్రతి ఒక గ్రాముకు 9 కేలరీల ఎనర్జీని ఇస్తాయి. ఇవి ఆహారంలో ఎంతో రుచిని కడుపు నిండటాన్ని, తృప్తిని మీకు కలిగిస్తాయి. విటమిన్లను కరిగించుకొని మీ శరీరానికి అందేలా చేస్తాయి.
నూనెల వాడకం శరీర అవయవాలకు మెత్తటి కవచంలా పనిచేస్తుంది. మన శరీరం కొన్ని ఫ్యాటీ యాసిడ్లను అంటే లినోలీక్ లినోలెనిక్ లను తయారు చేసుకోలేదు. కనుక మనం వాటిని బయటి కొవ్వులనుండి శరీరానికి అందించాల్సిందే.

English summary

Using Fats and Oils In A Healthy Diet! | వంటనూనె వాడే విధానం?

Keep all oils sealed from air and in a cool, dry place. It is a must to keep your oils sealed in a container and never leave it open. If you're in the habit of purchasing large bottles of oil in one go, then keep a small oil dispensar on the kitchen counter. Leave the big bottle in a cool, dry place, so that the oil doesn't react to bright sunlight.
Story first published: Thursday, July 26, 2012, 11:57 [IST]
Desktop Bottom Promotion