For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో బరువు పెరగడానికి అసలు కారణం ఇదే... దీనికి దూరంగా ఉండాలి!

చలికాలంలో బరువు పెరగడానికి అసలు కారణం ఇదే... దీనికి దూరంగా ఉండాలి!

|

మీ రెగ్యులర్ ధరించే మీ షర్ట్స్ మరియు జీన్స్ చలికాలంలో కొంచెం బిగుతుగా ఉన్నట్లు మీరు గమనిస్తున్నారా. మీరు ఇదివరకటిలా అన్నీ రోజువారి పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పటికీ ఈ సీజన్లో మీరు అదనపు బరువు ఉన్నట్లు ఫీలవుతున్నారా?ఖచ్చితంగా అవుననే చెప్పాలి. చలికాలంలో కాస్త బరువు పెరగడం సహజమే. ఇది మీ ఊహ మాత్రమే కాదు, శీతాకాలంలో చాలా మంది బరువు పెరుగుతారు.

reasons why people gain weight in winters and how to avoid it in telugu

చలికాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరిగే సమస్య కూడా ఉంటుంది. చలికాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు కీళ్లనొప్పులు, చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులకు కారణం కావడమే కాకుండా బరువులో కూడా హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యం అనిపించినా ఒక అధ్యయనం ప్రకారం, చాలా మంది చలికాలంలో మూడు నుండి ఐదు కిలోల వరకు పెరుగుతారట. మరి చలికాలలో ఇలా ఎందుకు అదనపు బరువు పెరుగుతారు. కారణాలు ఏంటో, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో ఈ కథనంలో మనం తెలుసుకోవచ్చు.

తక్కువ శారీరక శ్రమ

తక్కువ శారీరక శ్రమ

శీతాకాలంలో చల్లటి వాతావరణం వల్ల చాలా మంది ప్రజలు ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. చలికాలంలో మనమందరం బయటకు వెళ్ళకుండా బెడ్ పై ఎక్కువ సమయం గడుపుతాము. మనకు ఇష్టమైన పుస్తకాలు చదువుతాం. వ్యాయామాలకు వెళ్ళము. దాంతో మన శారీరక శ్రమ స్థాయి తగ్గుతుంది. అలాగే, చాలా మంది వాకింగ్ మరియు జాగింగ్ వంటి యాక్టివ్ రొటీన్‌లకు దూరంగా ఉంటారు. అందువల్ల, రోజులో మీరు తీసుకునే కేలరీలను మీరు బర్న్ చేయలేరు. ఇది చివరికి శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. ఈ సీజన్‌లో చురుకుగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేయడానికి ట్రైనర్ ను పెట్టుకోవాలి. అది స్నేహితుడు కావచ్చు లేదా పొరుగువాడు కావచ్చు. మీరిద్దరూ ఒకరినొకరు ఉత్సాహంగా మరియు శారీరకంగా చురుకుగా ఉంటారు.

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)

చలి కాలం మన మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వాతావరణంలో మార్పులు కారణంగా ఎండ లేకపోవడం వల్ల చాలా మంది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)కు గురి అవుతుంటారు. ఇది ఒక రకమైన క్లినికల్ డిప్రెషన్. ఇది తరచుగా అతిగా తినడం,పేళవమైన ఆహార ఎంపికలు మరియు మరింత నిశ్చల జీవనశైలికి దారితీస్తుంది. కాబట్టి కాలక్రమేణా, ఒక వ్యక్తి బరువు పెరగవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి,ఎండలో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి.

ఆహారాలు

ఆహారాలు

చలికాలంలో వాతవరణంలో ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోవటం వల్ల మనం ఎప్పుడూ వేడిగా ఉండే ఆహార పదార్థాలనే తినడానికి ఇష్టపడతాము. వేడి ఆహారం శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి మరియు మన మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ మితిమీరిన కార్బోహైడ్రేట్ మరియు కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుంది. బరువు పెరగకుండా ఉండటానికి, క్రీము సూప్‌లకు బదులుగా, స్వచ్చమైన పలుచటి సూప్‌ల వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం చూడండి. అలాగే, రోజంతా చురుకుగా ఉండటానికి, అదనపు కేలరీలను బర్న్ చేయడానికి మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

డీహైడ్రేషన్

డీహైడ్రేషన్

చలికాలం అయినా శరీరం హైడ్రేషన్ లో ఉంచుకోవడం మంచిది. దాంతో ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో, శరీర ఉష్ణోగ్రత కారణంగా మీరు ఎక్కువ నీటిని తీసుకుంటారు. కానీ చలికాలంలో అలా కాదు. చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండడం నిజమైన సవాలు. కొద్దిగా నిర్జలీకరణం కూడా ఆకలి అనుభూతిని అనుకరిస్తుంది. ఇది మీరు ఎక్కువ ఆహారం తినేలా చేస్తుంది. ఇది మీ బరువు పెరగడానికి దారితీస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడానికి ప్రయత్నించండి.

హార్మోన్ల సమస్యలు

హార్మోన్ల సమస్యలు

మధుమేహం మరియు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో నిజమైన సవాలును ఎదుర్కొంటారు. సాధారణంగా సీజన్ మారడంతో హార్మోన్లు నియంత్రణ కోల్పోతాయి. అసమతుల్య హార్మోన్లు ప్రజలు అతిగా తినడం లేదా బరువు తగ్గడం వంటి పురోగతిని ఆపవచ్చు. మీ హార్మోన్లు నియంత్రణలో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి రెగ్యులర్ చెకప్‌లను పొందండి. అవసరమైతే మీ వైద్యుడిని సంప్రదించండి.

 అతిగా నిద్రపోతున్నారు

అతిగా నిద్రపోతున్నారు

చలికాలంలో మనం ఎక్కువగా నిద్రపోతాం. వేసవిలో ఎండ వేడిమికి నిద్ర తక్కువ. కానీ చలికాలంలో మాత్రం చలి వల్ల మనం మంచం మీద నుంచి లేవడానికి చాలా సమయం పడుతుంది. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉండటం వల్ల మరికొంత ఎక్కువ సేపు నిద్రపోతాం. అతిగా నిద్రపోవడం వల్ల క్రమంగా బరువు పెరుగుతారు.

English summary

reasons why people gain weight in winters and how to avoid it in telugu

Here are the reasons why most people gain weight in winters and how to avoid it.
Story first published:Saturday, January 21, 2023, 17:23 [IST]
Desktop Bottom Promotion