Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
తక్షణ శక్తిని పొందడానికి 9 సులభమైన శక్తివంతమైన యోగాసనాలు
చాలా మంది గడుస్తున్న ఈ జీవిత కాలంలో మరియు కెరీర్ లో సంతోషంగా మరియు ప్రశాతంగా ఉండలేకపోతున్నామని చెబుతుంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో జీవితకాలం చాలా వేగంగా గడిసిపోతుంది . కొన్ని సందర్భాల్లో మన:శాంతిగా జీవించడం కూడా కష్టం అయిపోతుంది, నిజంగానే కొన్ని సందర్భాల్లో ఎనర్జీలేకుండా బలహీనంగా మారిపోతుంటాము . చాలా మంది వర్కౌట్ వల్ల చాలా అలసిపోతున్నామని కంప్లైన్ చేస్తుంటారు . వ్యాయామం ఖచ్చితంగా మీ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇది మిమ్మల్ని ఎప్పటికి అలసిపోయేట్లు చేయదు . ఒక వేళ వ్యాయామంతో పాటు మీరు యోగా చేయడం వల్ల జీవితంలో మరింత ఎక్కువగా యాక్టివ్ గా ఉండవచ్చు.
యోగా మీకు తక్షణ ఎనర్జీని అందించే ఒక పురాతన కాలం యొక్క వ్యాయామంగా చెబుతుంటారు . యోగాతో ఒక చిన్నపాటి యోగాతో ఒక బిట్ ఎనర్జీ పొందడం వల్ల మీ లైఫ్ మరింత బెటర్ గా ఉంటుంది. చిన్న పాటి యోగాసనాల వల్ల మీ శరీరంలో దాగిఉన్న ఎనర్జీలెవల్స్ బయటకు విడుదల కావడం వల్ల తక్షణ ఎనర్జీని పొందవచ్చు మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు . కాబట్టి, అలసటగా, నీరసంగా, బలహీనంగాఉన్నప్పుడు, తక్షణ ఎనర్జీ పొందడానికి ఈ క్రింద సూచించిన చిన్న పాటియోగాసనాలను పాటించడంతో మీరు చురుకైన లైఫ్ స్టైల్ పొందడంతోపాటు , రోజంతా ఎక్కువగా పనిచేయడానికి సహాయపడుతుంది. మరి ఆ చిన్నపాటి యోగాసనాలేంటో చూద్దాం...

మౌంటైన్ భంగిమ:
మీ శరీరం ఫర్ ఫెక్ట్ బ్యాలెన్స్ మరియు నిటారుగా ఉండాలని భావిస్తే ,మీ వర్కౌట్ ను మౌంటైన్ ఫోజ్ తో ప్రారంభించండి. మీ రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడి, రెండు చేతులను పైకి ఎత్తి , నిధానంగా శ్వాసతీసుకోవాలి.

ట్రీ భంగిమ:
ఈ ట్రీ (చెట్టు)భంగిమతో మీరు బలాన్ని మరియు బలాన్నికనుగొనవచ్చు. అందుకు రెండు చేతులను పైకి చాచి నమస్తే భంగిమలో నిలబడాలి. ఫోటోలో చూపించిన విధంగా ఒంటి కాలిమీద నిలబడాలి. ఈ యోగా భంగిమ మీ కండరాలకు బలాన్ని అందిస్తుంది. మరియు తక్షణం ఎనర్జిని పెంచుతుంది.

వారియర్ భంగిమ:
మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు, మీ శరీరం ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారవుతుంది. ఫోటోలో చూపిన విధంగా ముందుకు చేయిని చాచాలి చేయితో పాటు అడుగు కూడా ముందుకు వేయడం వల్ల వల్ల శరీరంలోని కండరాలు స్ట్రెచ్ అవుతాయి.

ట్రయాంగిల్ భంగిమ:
మీరు మీ శరీరాన్ని గోల్డెన్ ట్రయాంగిల్లో నిలబడినట్లైతే మీరు శక్తి వంతమైన ఎనర్జీని మీ శరీరం పొందగలదు . కాళ్ళను రెండింటిని దూరంగా చాచి, ఒక్క వైపు బెండ్ అవ్వాలి . ఒక చేయిని పైకి మరో చేయిని క్రిందికి 90డిగ్రీ ట్రైయాంగిల్లో చాచాలి.

కూర్చొని ట్విస్ట్ చేయడం:
ఇది ఒక బేసిక్ యోగా భంగిమ . మీ శరీరంలో కదలికలను కంట్రోల్ చేస్తుంది. నిటారుగా కూర్చొని ఎడమకాలు మీదుగా కుడికాలను వేసి, పూర్తిగా సైడ్ కు తిరగాలి . ఈ భంగిమలో తీసుకొనే శ్వాస వల్ల మీరు మరింత ఎక్కువ ఎనర్జిటిక్ గా భావిస్తారు.

డౌన్ వార్డ్ డాగ్ ఫోజ్:
ఈ భంగిమలో మీ శరీరం రెండు సమనా భాగాలుగా బెండ్ అవుతుంది . ఈ భంగిమ మీశరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. మీ బ్రెయిన్ కు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది . ఆటోమెటిక్ గా మీరు ఎక్కువ ఎనర్జీగా భావిస్తారు.

క్యాట్ ఫోజ్:
కొన్ని సందర్భాల్ల , స్ట్రెస్ క్రాప్స్ మీ కండరాల మీద బలంగా ఉంటుంది. మరియు మీ శరీరం బలహీనంగా మార్చుతుంది. మరి స్ట్రెస్ తగ్గించుకొని యాక్టివ్ గా ఉండాలంటే, ఈ క్యాట్ ఫోజ్ ను ట్రై చేయండి .

కోబ్రా ఫోజ్:
స్నేక్ లా యోగా భంగిమ , ఇది కేవలం మీ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవ్వడం మాత్రమే కాదు , చెస్ట్ ఫ్రీ అవ్వడంతో సులభంగా శ్వాస తీసుకోగలుగుతారు. ఎంత ఎక్కువ గాలి మీరు పీల్చుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

చైల్డ్ ఫోజ్:
బాలాసన లేదా ఫీటల్ ఫోజ్ అని పిలిచే ఈ భంగిమ కొన్ని సార్లు మీరు ఎక్కువ టెన్షన్ తో ఉన్నప్పుడు, ఈ భంగిమ మీ మనస్సును ప్రశాతం పరుస్తుంది . ఈ భంగిమ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
